అల్లు అర్జున్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని రోజులుగా రాంచరణ్, అల్లు అర్జున్ మధ్య సంబంధాలు సరిగా లేవనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాంచరణ్.. పుట్టినరోజున అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు. బర్త్ డే పార్టీకి కూడా హాజరు కాలేదు. అలాగే బన్నీ పుట్టిన రోజున చరణ్ ఎదో మొక్కుబడిగా చిన్న విష్ చేశారు. దీనితో అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతోంది అనే ప్రచారం ఉంది.