ఈరోజు ఎపిసోడ్ లో యష్, వేద, ఖుషి ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు ఎవరికి వాళ్ళు మౌనంగా ఉండడంతో అప్పుడు ఖుషి నాకు ఇక్కడ ఉండాలని లేదు వెళ్ళిపోదాం అని అనగా అదేంటి ఖుషి ఇంటి దగ్గర రెస్టారెంట్ కి వెళ్లాలని మారం చేస్తాము కదా అని అనగా మరి మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా అమ్మ మరి ఇద్దరూ సీరియస్ గా ఉన్నారు ఏంటి అని అడుగుతుంది ఖుషి. అప్పుడు ఇద్దరినీ ఖుషి నవ్వుమని చెప్పగా వేద యష్ నవ్వుతూ ఉంటారు. ఇంతలోనే ఎక్కడికి వెయిటర్ రావడంతో నాకు ఏం కావాలో నేను చెప్తాను నువ్వు డాడీకి ఏం కావాలో చెప్పు నీకు ఏం కావాలో డాడీ చెబుతాడు అని అంటుంది ఖుషి.