పెళ్లి పీఠలెక్కబోతున్న జై బాలయ్య సింగర్ సత్య యామిని, భర్తను పరిచయం చేసిన యువ గాయని

Published : Dec 05, 2022, 12:48 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. స్టార్ యాక్టర్స్ తో పాటు ఇండస్ట్రీకి సబంధించి వారు చాలా మంది పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. ఈక్రమంలోనే యంగ్ సింగర్ సత్య యామిని పెళ్ళి పీఠలెక్కబోతోంది.

PREV
17
పెళ్లి పీఠలెక్కబోతున్న జై బాలయ్య సింగర్  సత్య యామిని, భర్తను పరిచయం చేసిన యువ గాయని

ఫిల్మ్ ఇండస్ట్రీకి పెళ్ళి కళ వచ్చింది. వరుసగా స్టార్లు ఇంటివారు అవుతున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెపుతున్నారు. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ దాకా... ఈ ఏడాదంతా పెళ్ళి సందడితో మారు మోగి పోయింది. హాన్సిక, నాగశౌర్య, రణ్ భీర్ , ఆలియా,  నయనతార,  మంజిమా మోహన్‌, అదితి  ఇలా సినిమా స్టార్  సెలబ్రెటీలు పెండ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే  ప్రముఖ సింగర్‌ సత్య యామిని కూడా పెండ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. 

27

సింగర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది సత్య యామిని. ఇక త్వరలోనే పెళ్ళి చేసుకోబోతోంది. ఈ విషయంతో పాటు తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సింగర్‌ సత్యయామిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది. కాబోయే భర్తతో కలిసి  దిగిన ఫొటోను షేర్‌ చేసింది స్టార్ సింగర్ . అంతే కాదు.. జీవితకాలానికి సంబంధించిన రోలర్‌ కోస్టర్‌ వేచి ఉందంటూ ట్యాగ్ లైన్ కూడా రాసుకొచ్చింది.

37

పోస్ట్ తో పాటు ఫోటో అయితే పెట్టింది కాని.. అతని వివరాలు మాత్రం చెప్పలేద యామిని. ఏం చేస్తాడు..? ఎక్కడుంటాడు..? అసలెవరతను అనే విషయాలు మాత్రం గోప్యంగా ఉంచింది. అయితే అతనెవరంటూ.. వివరాలు చెప్పండని అడుగుతన్నారు యామిని ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే అతని వివరాలను మాత్రం యామిని వెల్లడించలేదు. 
 

47

మొత్తానికి సత్యయామినీ పెళ్లి కుదరడంతో.. తోటి సింగర్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వరుసగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలోకూడా  సత్య యామినికి  శుభాకాంక్షలు వెల్లువల వస్తున్నాయి. ఇక  సింగర్స్‌ గీతామాధురి, అనుదీప్‌, మనీషాతో పాటు మరికొంత మంది  సింగర్స్‌ క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్స్‌ పెట్టారు.

57

 పాడుతా తీయగా ప్రోగ్రాంమ్ ద్వారా తన సింగింగ్ టాలెంట్ ను చూపించుకుని బాలు తో శభాష్ అనిపించకుంది యామిని. ఆతరువాత సినిమా సింగర్ గా అద్భఉతంగా రాణించింది. ప్రస్తుతం మూవీలో సాంగ్స్ పాడటమే కాకుండా  స్వరాభిషేకం వంటి మ్యూజిక్‌ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి సినిమాలో ఆమె పాడిన మమతల తల్లి సాంగ్‌ యామినికి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. 

67

యామిని స్వీట్ వాయిస్ ఆమెకు ప్లాస్ .. యటాలీవుడ్‌లో వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంది. బాహుబలి తర్వాత శైలజారెడ్డి అల్లుడు, అల వైకుంఠపురములో.., కొండపొలం, అఖండ, వకీల్‌సాబ్‌, రాధేశ్యామ్‌, బింబిసార, అహింస సినిమాల్లో క్రేజీ సాంగ్స్‌ పాడింది. 

77

అఖండ సినిమాలో యామిని పాడిన  జై బాలయ్య పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.. ఈ పాట నందమూరి అభిమానులను ఉర్రూతలూగించింది. వీటితో పాటు ఎన్నో సినిమాల్లో పాటలు పాడి అలరించింది యామిని సినిమా పాటలతో పాటు తన యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా పలు కవర్‌ సాంగ్స్‌ కూడా చేసింది.
 

click me!

Recommended Stories