ఆయనతో నాకు 60 ఏళ్ల అనుబంధం ఉంది వేద ఆయనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని అంటుంది రాణి. ఈ 60 ఏళ్లలో ఎన్నో పూజలు చేశానో వ్రతాలు చేశాను దేవుడికి పొర్లు దండాలు పెట్టాను. దేవుడిని కోరుకున్న ప్రతిసారి నా భర్త ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి అని కోరుకుంటాను అని అంటుంది రాణి. భార్య అయిదో తనమంతా కూడా భర్తతోనే ముడిపడి ఉంటుంది. నాకు ప్రతి ఒక్కటి ఆయననే, ఆయన అంటే నాకు పిచ్చి ప్రేమ నేనంటే ఆయనకు పంచప్రాణాలు మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేము అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది రాణి.