Ennenno Janmala Bandham: అభిమన్యు గుట్టును బయటపెట్టిన ఖుషి.. సంతోషంలో యష్, వేద!

Published : Mar 10, 2022, 11:08 AM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ మంచి ప్రేమకథతో కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

PREV
16
Ennenno Janmala Bandham: అభిమన్యు గుట్టును బయటపెట్టిన ఖుషి.. సంతోషంలో యష్, వేద!
Ennenno Janmala Bandham

ఖుషి కోర్టులో మాళవిక (Maalavika) పేరు చెప్పటంతో వేద, యష్ బాధ పడిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు విరామ సమయంలో వేద (Vedha) తన తల్లి సులోచన కు ఫోన్ చేసి ఖుషి తనకు సొంతం కాలేదు అని బాధతో చెప్పటంతో సులోచన బాగా ఎమోషనల్ అవుతుంది. అక్కడే కూర్చున్న ఖుషి ని చూస్తూ తల్లడిల్లి పోతుంది వేద.
 

26
Ennenno Janmala Bandham

ఇక వేద దగ్గరికి వచ్చి యష్ (Yash) కాసేపు మాటల యుద్ధం చేస్తాడు. ఒంటరిగా కూర్చున్న ఖుషి దగ్గరకు జడ్జి వచ్చి ఎవరంటే ఇష్టమని అడిగి అసలు విషయాన్ని తెలుసుకుంటుంది. విరామం తర్వాత జడ్జి ఖుషి (Khushi) వైపు మాట్లాడుతూ వేద, యష్ లకు ఖుషి సొంతమని చెబుతుంది.
 

36
Ennenno Janmala Bandham

దాంతో మాళవిక కోపంతో రగిలి పోతూ ఉండగా.. జడ్జి సపోర్ట్ తో అభిమన్యు తనతో మాట్లాడిన విషయాన్ని బయటపెడుతుంది. ఇక మాళవిక, అభి (Abhi) కోపంతో రగిలి పోతూ ఉంటారు. మరోవైపు యష్, వేద ఖుషి సొంతం కావడంతో ఆనందాన్ని తట్టుకోలేక పోతారు. వెంటనే వేద ఖుషిని (Khushi) పట్టుకొని సంతోషంతో పొంగిపోతుంది.
 

46
Ennenno Janmala Bandham

ఇక అభిమన్యు గుట్టు బయట పడిపోవడంతో మాళవిక అభిమన్యుపై అరుస్తుంది. ఇక ఇద్దరు తెగ గొడవ పడుతూ ఉండగా యష్ (Yash) అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి వాళ్లకు గట్టిగా క్లాస్ ఇస్తాడు. అభిమన్యును (Abhimanyu) తన మాటలతో బాగా మండిపోయేలా చేస్తాడు. తన కూతురిని తన ఇంటి వద్ద వదిలి వెళ్లిపోవాలని గట్టిగా చెబుతాడు.
 

56
Ennenno Janmala Bandham

అప్పుడే మాలిని వచ్చి నేను వెళ్ళి తీసుకు వస్తాను అని అంటుంది. కానీ యష్ (Yash) మాత్రం తానే తీసుకు వస్తాడు అని అంటాడు. మరోవైపు వేద తన తల్లికి ఫోన్ చేసి ఖుషి తన సొంతం అయ్యిందని చెబుతుంది. వెంటనే సులోచన సంతోషపడుతూ వేద (Vedha) గొప్పదనాన్ని పొగుడుతుంది. అంతేకాకుండా వేద తన కూతురు అయినందుకు ఎన్ని జన్మల పుణ్యమో అని అంటుంది.
 

66
Ennenno Janmala Bandham

ఇక తరువాయి భాగంలో అభిమన్యు యష్ (Yash) తో వేద గురించి తన నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో వెంటనే యష్ కోపంతో రగిలిపోతాడు. వేదమంత్రాలతో తను తాళి కట్టిన భార్య అని వేద (Vedha) పేరు చెబుతూ ఉండగా అప్పుడే వేద వచ్చి యష్ ను చూసి షాక్ అవుతుంది.

click me!

Recommended Stories