అయితే ఈ కామెంట్లు, మీమ్స్,ట్రోల్స్ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె అభిమానులు ఆవేదనతో చేసిన వ్యాఖ్యలని కొందరు, సమంతపై గౌరవంతో చెబుతున్న మాటలని మరికొందరు అంటున్నారు. అదే సమయంలో సమంత తన బాడీ, తన డ్రెస్, తన కెరీర్ తన ఇష్టమని, చెప్పడానికి మీరు ఎవరని ప్రశ్నిస్తున్నారు. రెండింటిలోనూ వాస్తవాలు లేకపోలేదు.