Yami Gautam Upset: యామీ గౌతమ్ కు ఘోర అవమానం, నా గుండె ముక్కలయ్యిందన్న నటి

Published : Apr 09, 2022, 12:15 PM IST

ఆమధ్య సోషల్ మీడియా హ్యాక్ అయ్యిందంటూ వార్తల్లో నిలిచింది బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు ఘోరమైన అవమానం జరిగిందంటోంది.   

PREV
17
Yami Gautam Upset: యామీ గౌతమ్ కు ఘోర అవమానం, నా గుండె ముక్కలయ్యిందన్న నటి

ఈ మధ్య బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కాంట్రవర్సియల్ స్టార్ గా పేరున్న యామీ.. ఈసారి తనకు అవమానం జరిగిందంటోంది. తన గుండె ముక్కలయ్యిందంటోంది. ఇంతకీ యామీకి జరిగిన ఆ అవమానం ఏంటీ.

27

అభిషేక్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా  దస్వీ. ఏప్రిల్‌ 7న ఓటీటీ  వేదికగా నెట్‌ఫ్లిక్స్‌ జియో సినిమా లో రిలీజైందీ మూవీ. ఈ క్రమంలో ఓ బాలీవుడ్‌ వెబ్‌సైట్‌ యామీ నటన గురించి తన రివ్యూలో డిఫరెంట్ గా రాసింది. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.  
 

37

వెబ్ సైట్ లో యామీ గురించి రాస్తూ..ఇన్నాళ్లుగా చేసిన సాధారణ ప్రియురాలి పాత్రలకు ఈ సినిమాతో యామీ చెక్‌ పెట్టిందని, ఇందులో ఆమె యాక్టింగ్  పర్వాలేదని రాశారు. ఇంతకాలంగా యామీకి అసలు నటించడమే రాలేదన్నట్లుగా అందులో రాయడంతో ..ఈ రివ్యూ చదివిన యామీ వెంటనే సోషల్ మీడియాలో స్పందించింది. 

47

ఇది చదివిన తరువాత తన మనసు ముక్కలైందంటూ సోషల్‌ మీడియాలో స్పందించింది యామీ గౌతమ్. తనను అగౌరవపర్చారంటూ బాధపడింది. తనను ఇంతలా అవమానించి.. బాధపెట్టడం వల్ల మీకు ఏమోచ్చిందంటూ వాపోయింది     యామీ. 

57

అంతే కాదు  తాను విమర్శలను స్వీకరిస్తానని. అందులో తప్పొప్పులను సరి చేసుకుంటాను. కానీ కావాలని టార్గెట్‌ చేస్తూ నన్ను దిగజార్చాలని చూస్తున్నారు. అలాంటప్పుడు వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటుంది యామీ. . ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. అంటుంది యామీ గౌతమ్. 
 

67

అంతే కాదు ఎ థర్స్‌డే, బాలా, ఉరి సినిమాల్లో కూడా  నా పర్ఫామెన్స్‌ను  విమర్శిస్తున్నారు. ఇది మంచి పద్థతి కాదు అంటుంది. తను అంత     ఈజీగా ఈ స్థాయికి రాలేదని దానికోసం తాను చాలా కష్టపడాల్సి వచ్చిందంటోంది యామీ గౌతమ్. 

77

సొంతంగా ఎదిగిన నాలాంటి యాక్టర్స్‌కు మళ్లీ మళ్లీ నిరూపించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. నిజంగా నా గుండె ముక్కలయ్యింది. ఒకప్పుడు మీ సైట్‌ను ఫాలో అయ్యేదాన్ని. కానీ ఇప్పుడదిక అవసరం లేదనిపిస్తోంది. దయచేసి మీరు నా సినిమాల గురించి, నా పర్ఫామెన్స్‌ గురించి రివ్యూ ఇవ్వకండి అని ఫైర్‌ అయింది యామీ గౌతమ్‌.

Read more Photos on
click me!

Recommended Stories