నమ్రత అడ్డుపడ్డారు, ఈసారి మహేష్ పై సుప్రీం కోర్టులోనే కేసు వేస్తా.. ముదురుతున్న శ్రీమంతుడు వివాదం

First Published Feb 2, 2024, 6:57 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని రకాల ప్రేక్షకులను అలరించింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని రకాల ప్రేక్షకులను అలరించింది. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. 

అయితే శ్రీమంతుడు కథని దర్శకుడు కొరటాల శివ తాను రచించిన చచ్చేంత ప్రేమ అనే నవల నుంచి మక్కీకి మక్కీ కాపీ కొట్టారు అంటూ రచయిత శరత్ చంద్ర కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం మరింతగా ముదురుతున్నట్లు తెలుస్తోంది. కోర్టులు కూడా శరత్ చంద్రకి అనుకూలంగగా తీర్పు ఇస్తూ కొరటాల శివ విచారణ ఎదుర్కొనవలసిందే అని చెబుతున్నాయి. 

Latest Videos


చచ్చేంత ప్రేమ, శ్రీమంతుడు కథలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చచ్చేంత ప్రేమ నవల కథ చూస్తుంటే పేర్లు మార్పు తప్ప కథ మొత్తం ఒకేలా ఉంది. నవలలో హీరో తండ్రి ఎమ్మెల్యే గా ఉంటాడు. శ్రీమంతుడులో వ్యాపారిగా ఉంటాడు. వివాదంలో చిక్కుకుని ఊరి నుంచి వెళ్లిపోవడం.. అతడి కొడుకు హీరో.. అతడి స్నేహితుడి కుమార్తె హీరోయిన్ ఒకే కాలేజ్ లో చదువుకోవడం ఇలా కథ మొత్తం ఒకే విధంగా ఉంది. 

అందుకే రచయిత శరత్ చంద్ర తనకు న్యాయం జరగాలని గట్టిగా పోరాటం చేస్తున్నారు. కొరటాల శివ ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు శ్రీమంతుడు ఉచ్చు మహేష్ బాబు మెడకి కూడా చిక్కుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేష్ బాబుపై, మైత్రి నిర్మాత నవీన్ పై సుప్రీం కోర్టులో కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 

స్వయంగా ఆయనే ఈ హెచ్చరిక చేశారు. నేను సుప్రీం కోర్టులో మహేష్ బాబు, నిర్మాత నవీన్ పై పలు కేసులు నమోదు చేస్తాను. గతంలోనే మహేష్ బాబుకి నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు. నమ్రత గారు అడ్డుపడి ఎంబి క్రియేషన్స్ ఓనర్ షిప్ ని మహేష్ నుంచి మరో వ్యక్తిని మార్చేశారు. ఈసారి సుప్రీం కోర్టుకి వెళతా అంటూ శరత్ చంద్ర హెచ్చరించారు. 

మహేష్ బాబు కూడా శ్రీమంతుడు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. కొరటాల శివ, మహేష్ బాబు, మైత్రి సంస్థ ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటారో అనే ఉత్కంఠ నెలకొంది. 

click me!