ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ కుటుంబ సమస్యల కారణంగా వారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత అభిషేక్ జీవితంలోకి ఐశ్వర్య వచ్చింది. ఉమెన్సెరా ప్రకారం, శ్వేతా ఎప్పుడూ అభిషేక్, ఐశ్వర్యల వివాహాన్ని అంగీకరించలేదు. మొదటి నుంచి అభిషేక్‌కి ఐశ్వర్యతో ఉన్న సంబంధం ఆమెకు ఇష్టం లేదు. శ్వేతా తన వదినగా ఐశ్వర్య కాకుండా కరిష్మా కపూర్ రావాలని కోరుకుందట.