`హిట్‌` యూనివర్స్ లో బాలకృష్ణ? ఫస్ట్ టైమ్‌ కొత్త జోనర్‌ మూవీ, బాలయ్యకి సెట్‌ అవుతుందా?

First Published | Oct 6, 2024, 3:42 PM IST

బాలకృష్ణ ఇటీవల సినిమాల విషయంలో తన పంథా మార్చుకున్నారు. కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన `హిట్‌` సిరీస్‌లో ఆయన నటించబోతున్నట్టు టాక్‌. 
 

బాలకృష్ణ బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటికే మూడు విజయాలు అందుకున్నారు. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఇప్పుడు మరో హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే 109` సినిమాలో నటిస్తున్నారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతుంది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఓ సరికొత్త కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు బాబీ. బాలయ్య మార్క్ యాక్షన్‌తోపాటు థ్రిల్లర్‌ అంశాలు కూడా ఇందులో ఉండబోతున్నాయని తెలుస్తుంది. బాలయ్య క్యారెక్టరైజేషన్‌ కూడా కొత్తగా ఉండబోతుందట. రెగ్యూలర్‌ మాస్‌ రోల్లో కాకుండా చాలా సంఘర్షణ, చాలా వైల్డ్ గా, చాలా బోల్డ్ గా ఆయన పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. 
 

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి గ్లింప్స్ మాత్రమే విడుదల చేశారు మేకర్స్. ఫ్యాన్స్ ని హ్యాపీ చేసేలా చిన్న గ్లింప్స్ లను విడుదల చేశారు. సినిమా ఎలా ఉండబోతుందనే హింట్‌ ఇచ్చారు, తప్పితే కథ ఎలా ఉండబోతుంది? ఏం చూపించబోతున్నారనేదానిపై క్లారిటీ లేదు. అంతేకాదు సినిమా టైటిల్‌ కూడా కన్ఫమ్‌ చేయలేదు. ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ ఇంకా క్లారిటీ లేదు. సంక్రాంతికి రాబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. కానీ ఆ విషయంలోనూ స్పష్టత లేదు. ఇటీవల హీరోయిన్‌ని ప్రకటించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలయ్యతో ఆమె మొదటిసారి జోడీ కడుతుంది. ఇందులో బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. 
 


ఈ మూవీ తర్వాత బాలయ్య.. బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే దీన్ని ప్రకటించారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. `అఖండ2`గా దీన్ని తెరకెక్కిస్తారని అంటున్నారు. కానీ కొత్త కథతో రాబోతుందని తెలుస్తుంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. `అఖండ` సంచలన విజయం సాధించడంతో మరోసారి ఈ కాంబో రిపీట్‌ కాబోతున్న నేపథ్యంలో ప్రారంభానికి ముందునుంచే మంచి అంచనాలున్నాయి.

అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే `సింహా`, `లెజెండ్‌`, `అఖండ` సినిమాలు వచ్చాయి. మూడూ పెద్ద హిట్‌. బాలయ్యకి వరుస ఫ్లాపుల తర్వాత బోయపాటినే హిట్‌ ఇస్తూ మళ్లీ ఫామ్‌లోకి తీసుకొస్తున్నారు. దీంతో అత్యంత సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌గా బాలయ్య, బోయపాటి కాంబోకి నిలిచింది. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. 

ఇక బాలయ్య నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఆయన ఫస్ట్ టైమ్‌ ఓ కొత్త జోనర్‌లో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. `హిట్‌` యూనివర్స్ లో భాగం కాబోతున్నారట. దర్శకుడు శైలేష్‌ కొలను `హిట్‌` యూనివర్స్ పేరుతో వరుసగా సినిమాలను రూపొందిస్తున్నారు.

ఇప్పటికే సిరీస్‌ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. మొదటి భాగంలో విశ్వక్‌ సేన్‌ నటించారు. రెండో భాగంలో అడవిశేష్‌ నటించాడు. ఇప్పుడు మూడో భాగం(హిట్‌ 3)లో నాని హీరోగా నటిస్తున్నారు. ఇది ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. అనంతరం `హిట్‌ 4` కోసం బాలయ్యని అప్రోచ్ అయ్యారట. నాల్గో సీక్వెల్‌ లో బాలయ్య హీరోగా నటిస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నారు.

గతంలోనే ఆయన బాలయ్యని అప్రోచ్‌ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ అది జస్ట్ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి. బాలయ్యని దర్శకుడు శైలేష్‌ కలిసి కథ నెరేట్‌ చేశాడట. 
 

మరి బాలకృష్ణ ఈ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇది చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చర్చలు పాజిటివ్‌గా ఉన్నాయని టాక్. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. అయితే బాలయ్య ఇలాంటి మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలు చేయలేదు. ఆయనకిది పూర్తిగా కొత్త అనే చెప్పాలి.

పైగా ఆద్యంతం సస్పెన్స్ గా సాగే ఈ థ్రిల్లర్‌ మూవీస్‌ బాలయ్యకి సెట్‌ అవుతాయా? ఆయనకు ఇలాంటి జోనర్‌ సెట్‌ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. భారీ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే బాలయ్య, భారీ యాక్షన్‌ సీన్లతో ఉచకోత కోసే బాలయ్య, అదిరిపోయే మాస్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించే బాలయ్య మర్డర్‌ కేసు, ఇన్వెస్టిగేషన్ అంటూ తిరిగితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అనేది పెద్ద ప్రశ్న.

అయితే బాలయ్య ఇటీవల కొత్త జోనర్‌ సినిమాలను ఎక్స్ ప్లోర్‌ చేయాలని, కొత్త తరహా కథలు, పాత్రలు చేయాలని భావిస్తున్నారు. తన కూతురు తేజస్విని సలహాల మేరకు ఆయన మార్పు దిశగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే `హిట్‌ 4` ఆయన వద్దకు వెళ్లినట్టు టాక్. మరి బాలయ్య చేస్తాడా? లేదా? అనేది చూడాలి. 
 

Latest Videos

click me!