పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో రియల్ స్టంట్స్ చేసి పవన్ కళ్యాణ్ తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచాడు. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి విజయాలు పవన్ కళ్యాణ్ కి స్టార్డం తెచ్చిపెట్టాయి.
2001లో విడుదలైన ఖుషి పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. యూత్ పవన్ కళ్యాణ్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఖుషి అనంతరం పవన్ కళ్యాణ్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎక్కడగా తగ్గలేదు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ కి మంచి విజయాలు అందించాయి. ఆయన తిరిగి ట్రాక్ లో పడ్డాడు.