ఐశ్వర్య లేకుండా అయోధ్యకు ఒంటరిగా వచ్చిన అభిషేక్, మొదలైన విడాకుల వివాదం?

First Published | Jan 23, 2024, 12:16 PM IST

అయోధ్య రామాలయంలో జరిగే కుంబాభిషేకానికి హాజరయ్యేందుకు నటుడు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యరాయ్ లేకుండా ఒంటరిగా వచ్చారు.

మరోసారి బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యారాయ్.. అభిషేక్ బచ్చన్ మధ్య విడాకుల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ న్యూస్ పుట్టడానికి అయోధ్య రామ మందిరం కారణంఅయ్యింది. అవును. ఈ వివాదం అక్కడే స్టార్ట్ అయ్యింది. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని.. అయోధ్యలో అభిషేక్ ను చూసి.. అంతా ఈ విషయంలో ఫిక్స్ అయ్యారు. 
 

మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత, ఐశ్వర్యారాయ్ తమిళ  సినిమాలతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తమిళంతో పాటు  హిందీ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీస్ లో నటించింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ కాస్త డౌన్ అవుతున్న టైమ్ లో  ఆమె 2007లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. 
 


ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది.పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న ఐశ్వర్యరాయ్ దాదాపు 12 ఏళ్ల తర్వాత పొన్నీల సెల్వన్ సినిమాతో కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ బ్యూటీ. ఈ సినిమాలో నందిని పాత్రలో లేడీ విలన్ గా నటించి మెప్పించింది. ఈ రెండు సినిమాలు తమిళ  బాక్సాఫీస్ వద్ద మాత్రమే భారీ హిట్ అయ్యాయి.

ఇక పొన్నీల సెల్వన్ సినిమాల రిలీజ్ తరువాత  ఐశ్వర్యరాయ్ పై రకరకాల రూమర్స్ వచ్చాయి. మొదట ఆమె గర్భవతి అని, త్వరలో ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోందని చెప్పారు. అది నిజం కాదు అని తెలిసిన తరువాత ఐశ్వర్యకు కుటుంబంల కలహాలు వచ్చాయన్నారు. ఆమె తన  అత్తగారు జయా బచ్చన్‌తో గొడవలు వచ్చాయన్నారు. ఈకారణంగా ఆమె ఫ్యామిలీకి దూరంగా ఉంటుందంటూ రూమర్స్ వచ్చాయి. 
 

అంతే కాదు అత్తగారితోవచక్చిన వివాదాల కారణంగానే  ఐశ్వర్య కొన్ని నెలల క్రితం అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఎప్పుడూ ఏ కార్యక్రమానికైనా జంటగా వెళ్లే వీరు.. ఈమధ్య ఏ ప్రోగ్రామ్ ఉన్నా.., విడి విడిగానే వెళ్తున్నారు. ఐశ్వర్య రాయ్ గతంలో కోన్ని కార్యక్రమాలకు కూతురు ఆరాధ్యను తీసుకుని వెళ్లారు.. అని అభిషేక్ కనిపించలేదు. దాంతో వీరి విడాకుల రూమర్స్ పెరిగాయి. 

Aishwarya Rai and Abhishek Bachchan Divorce,.jpg

ఈ పరిస్థితిలో ఈరోజు అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు నటుడు అభిషేక్ బచ్చన్ తన భార్య లేకుండా ఒంటరిగా వచ్చారు . దీంతో బాలీవుడ్‌లో వీరి విడాకుల వివాదం మళ్లీ రాజుకుంది. ఐశ్వర్యరాయ్ ఎందుకు రాలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అటు రణ్ బీర్ తన భార్య హీరోయిన్ ఆలియాతో వచ్చాడు, విక్కీ కౌశల్ కూడా భార్య స్టార్ హీరోయిన్ కత్రీనాతో కలిసి వచ్చాడు. కాని అభిషేక్ ఒంటరిగా రావడంతో అంతా వీరి విడాకులు గురించి గుసగుసలాడుకుంటున్నారు. 

Latest Videos

click me!