Mrunal Thakur : ‘సీతారామం’ హీరోయిన్ వర్క్ అవుట్స్ చేయడం చూశారా? జిమ్ లో వేడిపుట్టిస్తోందిగా.!

First Published | Jan 23, 2024, 11:20 AM IST

క్రేజీ హీరోయిన్  మృణాల్ ఠాకూర్ Mrunal Thakur ఎప్పుడూ అందంగానూ, ఫిట్ గానూ కనిపిస్తుంటారు. అయితే ఆమె ఫిట్ నెస్ వెనక ఎంతో శ్రమిస్తుంటుంది. జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తోంది. ఆ సంబంధించిన ఫొటోలు వైరల్ గామారాయి. 

‘సీతారామం’ చిత్రంతో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్ గా అలరించింది. అద్భుతమైన నటనతో ఆకట్టుుకుంది. ఆడియెన్స్ లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 
 

దాంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు దక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. నెక్ట్స్ తన ప్రాజెక్ట్స్ లోనూ బిజీగా ఉంటోంది. 


ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. తన గురించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది. 

అయితే, మృణాల్ ఠాకూర్ ఎప్పుడూ అందంగా, ఫిట్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. రకరకాల అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది. అంత ఫిట్ గా ఉండేందుకు మృణాల్ జిమ్ లో ఎంతగానో శ్రమిస్తుంటుంది. 
 

ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. జిమ్ లో అన్ని రకాల వర్కౌట్స్ చేస్తూ మతులు పోగొట్టింది. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ఫ్యాట్ కరిగిస్తూ జిమ్ లో హీట్ పెంచింది. 

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వర్కౌట్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జిమ్ మోటీవేషన్ గా భావిస్తున్నారు. లైక్స్, కామెంట్లతో అభినందిస్తున్నారు. నెక్ట్స్ మృణాల్ విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’తో అలరించబోతోంది. 

Latest Videos

click me!