Brahmamudi
BrahmaMudi 23rd January Episode: హాస్పిటల్ లో కావ్య.. ఆ నర్స్ అన్న మాటలు విని కుప్పకూలిపోతుంది. శ్వేతకి రాజ్ కాబోయే భర్త అన్న మాట విని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఐసీయూ రూమ్ లో రాజ్.. ప్రేమగా శ్వేతతో మాట్లాడటం తన కళ్లారా చూస్తుంది. అది చూసి మరింత ఏడుస్తుంది. వెనక నుంచి స్వప్న వచ్చి.. ఏవరు ఉన్నారు..? ఐసీయూలో ఎవరైనా తెలిసినవారు ఉన్నారా అని అడుగుతుంది. ఎవరూ లేరక్కా అని స్వప్నను చూడనివ్వకుండా.. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతుంది. వచ్చాయని స్వప్న చెప్పడంతో.. అక్కడి నుంచి అక్కాచెల్లెళ్లు వెళ్లిపోతారు.
Brahmamudi
ఇక ఇంట్లో కిచెన్ లో ధాన్యలక్ష్మి కుస్తీపడుతూ ఉంటుంది. ఇందిరా దేవి వచ్చి.. కావ్యకు ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ కి వెళ్లిందని.. వంట సంగతి నువ్వే చూసుకో అని చెబుతుంది. కావాలంటే అనామిక సహాయం తీసుకో అని చెబుతుంది. దానికి ధాన్యలక్ష్మి.. కొత్త పెళ్లి కూతురు తనతో ఎందుకు లే నేను చేస్తాను అని అంటుంది. అప్పుడే రుద్రాణి వచ్చి.. కోడలిని కూతురిలా చూసుకుంటున్నావా అని అంటుంది. దానికి ఇందిరాదేవి... అందరూ నీలానే ఉండరు కదా అని సెటైర్ వేస్తుంది. ఇక, అప్పుడే.. కళ్యాణ్ కిందకు దిగి వస్తాడు. ఇందిరా దేవి పిలిచి.. తన గదిలో గీజర్ పని చేయడం లేదని, తాతయ్య బట్టలు కుట్టీయడానికి టైలర్ రాలేదని చెప్పడంతో.. ఆ పనులు చూసుకోమని కళ్యాణ్ కి చెబుతుంది, సరే అని కళ్యాణ్ అంటాడు.
Brahmamudi
అయితే, ఆ మాటలను విన్న రుద్రాణి.. చూశావా.. నీ కొడుక్కి ఎలాంటి పనులు చెబుతున్నారో అని ఎక్కిస్తుంది. కానీ ధాన్యలక్ష్మి పట్టించుకోదు. అదే సమయానికి అపర్ణ వచ్చి... కళ్యాణ్ ని తనను గుడికి తీసుకువెళ్లమని, డ్రైవర్ అందుబాటులో లేడని.. నువ్వు ఖాళీనే కదా అని అడుగుతుంది. సరే అని కళ్యాణ్ అంటాడు. ఆ మాటలను కూడా.. మళ్లీ రుద్రాణి ధాన్యలక్ష్మికి ఎక్కిస్తుంది. ఈ సారి.. తన తోటి కోడలు కూడా ఇలా పనులు చెప్పడం ధాన్యలక్ష్మికి బాగానే కోపం వస్తుంది. ఇప్పుడు నీ కొడుక్కి పనులు చెప్పినట్లే.. త్వరలో నీ కోడలికి కూడా చెబుతారు అని రుద్రాణి అంటుంది. కావ్య అంటే ఎవరికీ ఇష్టం లేకపోయినా.. రాజ్ భార్య కాబట్టే గౌరవం ఇస్తున్నారని, ఆ గౌరవం అనామికు దక్కదు అని బాగా ఎక్కిస్తుంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.. కావ్య హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. ఏమైందని.. ఇందిరా దేవి అడుగుతుంది. కావ్య ఏమి చెప్పకుండా ఆమెను హత్తుకొని ఏడుస్తుంది. తర్వాత నీరసంగా ఉందని పడుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది. బీపీ డౌన్ అయ్యిందని.. అందుకే కళ్లు తిరిగాయి అని స్వప్న చెబుతుంది. అసలు దీనికి అంత సమస్య ఏం వచ్చిందో అని స్వప్న అంటే.. ఇంట్లో అందరూ ప్రతి దానికీ కావ్యపైనే పడిపోతున్నారని , ఆ ఒత్తిడి వల్లే ఇలా జరిగిందని ఇందిరా దేవి అంటుంది.
ఇక, కావ్య బెడ్రూమ్ లో కూర్చొని హాస్పిటల్ లో తన చెవిన పడిన మాటలు తలుచుకుంటూ, శ్వేతతో రాజ్ క్లోజ్ గా ఉన్న విజువల్స్ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. బ్రాగ్రౌండ్ లో ఓ సాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.. మూర్తి తనకు వచ్చిన డీల్ ఎలా పూర్తి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య ఉంటే.. చాలా సహాయం చేసేదని.. ఇప్పుడు కావ్య లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని మాట్లాడుకుంటూ ఉంటారు. చలికి చలి మంట కాచుకుంటూ తమ కష్టాల గురించి మూర్తి, కనకం, రాజ్యలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అప్పూ వస్తుంది. ఆ చలి మంటలో కళ్యాణ్ ఫోటోలు, గతంలో తనకు ఇచ్చిన చీర అన్నీ పడేస్తుంది. అప్పూ చేసిన పనికి ఇంట్లో వాళ్లు షాకౌతారు.కానీ.. అప్పూ మాత్రం... తాను కవిని మర్చిపోవాలని అనుకుంటుున్నానని.. ఇక నుంచి...ఇంటి కోసం కష్టపడతాను అని చెబుతుంది. ఆ మాటలకు ఇంట్లో వాళ్లు సంతోషిస్తారు. మూర్తి అప్పూని దగ్గరకు తీసుకొని అభినందిస్తాడు.
Brahmamudi
ఇక.. తర్వాత దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అనామిక వడ్డిస్తూ ఉంటుంది. కావ్య ఎందుకు వడ్డించడం లేదు అని రాజ్ అడుగుతాడు. నీకు తెలీదా అని ఇందిరాదేవి మొదలుపెడుతుంది. భార్య కు ఆరోగ్యం బాగోకపోతే నువ్వు పట్టించుకోవా అని రాజ్ కి ఇందిరాదేవి క్లాస్ పీకుతుంది. నాకు చెప్పలేదు అని రాజ్ అంటే.. కావ్య ఫోన్ చేసిందని.. నవ్వే పట్టించుకోలేదు అని అంటారు.
ఆ తర్వాత తానే హాస్పిటల్ కి తీసుకువెళ్లాను అని స్వప్న చెబుతుంది. ఆ మాట విన్న తర్వత రాజ్ బాగా ఫీలౌతాడు. తనకు ఆకలిగా లేదు అని భోజనం చెయ్యకుండా వెళ్లిపోతాడు. తన కొడుకు ని కనీసం భోజనం కూడా చెయ్యనివ్వలేదని అపర్ణ ఫీలౌతుంది. తర్వాత... రుద్రాణి ఇంట్లో ఒక్క గీజర్ కూడా పనిచేయడం లేదు, వేడి నీళ్లు పెట్టడానికి కావ్యకు కూడా బాలేదు కదా అని అంటుంది.
Brahmamudi
వెంటనే అపర్ణ.. కళ్యాణ్ నీకు చెప్పాను కదా ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతుంది. ఆ మాటకు ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది. అందరూ తన కొడుక్కే పనులు చెబుతున్నారని.. నీకు నీ కొడుకు ఎంతో.. నాకు నా కొడుకు అంతే అని అంటుంది. నీ కొడుకు పెళ్లికి బాగోకపోయినా హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లలేని బిజీగా ఉంటాడు.. నా కొడుకు మాత్రం ఖాళీగా ఉంటాడా అని ధాన్యం అడుగుతుంది. ఆ మాటలకు అపర్ణ బాగా హర్ట్ అవుతుంది. కళ్యాణ్ సర్ది చెప్పాలని చూసినా ధాన్యం వినిపించుకోదు. అందరూ తన కొడుకి ని తక్కువ చేస్తున్నారని మాట్లాడుతుంది. ఆ మాటలకు బాధపడిన అపర్ణ భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Brahmamudi
ఇక్కడ తోటి కోడళ్ల మధ్య జరిగిన గొడవకు అనామిక తెగ సంబరపడిపోతుంది. వెంటనే ఈ విషయాన్ని తన తల్లి కి చెబుతుంది. కళ్యాణ్ ని కూడా తన గ్రిప్ లో ఉంచుకోవడానికి తనని దూరం పెడుతున్నాను అని చెబుతుంది. అదేంటి అని తల్లి అడిగితే.. ‘ తెలివి తక్కువ ఆడది.. భర్తను బానిసగా చేసి తను యజమాని అవుతుంది. తెలివైన భార్య అయితే.. భర్తను రాజుని చేసి.. తాను రాణి అవుతుంది’ అని చెబుతుంది. ఆ మాటలకు కూతురి తెలివి కి ఆమె తల్లి శైలజ మురిసిపోతుంది. ఎదురుగా భార్యను పెట్టుకొని ఏమీ చెయ్యలేకపోతున్నందుకు బాధపడుతూ కళ్యాన్.. తర్వాత తాను ఏది చెబితే అది చేస్తాడు అని చెబుతుంది.
అప్పుడే కళ్యాణ్ రావడంతో అనామిక ఫోన్ పెట్టేస్తుంది. ఎవరు ఫోన్ అని కళ్యాణ్ అడిగితే అమ్మ అని చెబుతుంది. వినేశాడేమో అని భయపడుతుంది. కానీ.. కళ్యాణ్ ఏమీ వినడు. కాసేపు కాస్త రొమాంటిక్ గా ఉండాలని ప్రయత్నిస్తాడు. కానీ.. అనామిక ఆ పప్పులేమీ ఉడకనివ్వదు. దూరం పెట్టేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పక్కనే ఉన్నా..ఏమీ చెయ్యనివ్వడం లేదని కళ్యాణ్ ఫీలౌతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.