​ బిగ్ బాస్ ఓటింగ్ లో టాప్ కంటెస్టెంట్ కి షాక్, రేసులో ముందుంది ఎవరంటే?

First Published | Oct 5, 2024, 4:27 PM IST


ఐదవ వారానికి గాను విష్ణుప్రియ, నాగ మణికంఠ, నబీల్, నిఖిల్, ఆదిత్య ఓం, నైనిక నామినేట్ అయ్యారు. ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలో అడుగుపెట్టింది. 14 మంది సెలెబ్స్ తో మొదలైన షోలో ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. మొదటి వారం సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. వరుసగా శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఇంటి బాట పట్టారు.

సోనియా గత వారం ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యంత నెగిటివిటీ నడిచింది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ప్రవర్తన విమర్శలపాలైంది. తోటి కంటెస్టెంట్స్ పై ఆమె చేసిన కామెంట్స్, యాటిట్యూడ్ ఆడియన్స్ కి నచ్చలేదు. ఈ క్రమంలో సోనియాకు ఓట్లు పడలేదు. సోనియా తిరిగి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. 

ఆదివారం సోనియా ఎలిమినేట్ కాగా... సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. తగు కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ఫోటోను మంటల్లో కాల్చి వేయాలి. ఎప్పటిలానే కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు. 


Bigg boss telugu 8

ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, నైనిక, నబీల్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓపెన్ గా ఉంటాయి. 

అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటు ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని నాగార్జున చెప్పారు. చెప్పినట్లే.. ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. అత్యల్పంగా ఓట్లు పొందిన ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. దాంతో వరుసగా ఐదుగురు ఇంటిని వీడినట్లు అయ్యింది. 

కాగా సీజన్ కి బిగ్ బాస్ హౌస్లో ఉన్న టాప్ సెలెబ్ ఎవరంటే విష్ణుప్రియ అని చెప్పొచ్చు. ఆమెను మినహాయిస్తే... కనీసం ఫేమ్ ఉన్న సెలెబ్స్ హౌస్లో లేరు. ఆదిత్య ఓం ఒకప్పటి హీరో. ఎంతో కొంత ఫేమ్ ఉన్న ఆదిత్య, అభయ్ నవీన్ కూడా ఎలిమినేట్ అయ్యారు. ప్రేరణ, యష్మి. నిఖిల్, పృథ్విరాజ్.. పాపులారిటీ లేని సీరియల్ నటులు. కాబట్టి విష్ణుప్రియకు పెద్దగా పోటీ లేకుండా పోయింది. 

విష్ణుప్రియ ఏమాత్రం పెర్ఫార్మన్స్ ఇచ్చినా.. టైటిల్ ఎగరేసుకుపోవచ్చు. అయితే విష్ణప్రియ గేమ్ టైటిల్ కొట్టే స్థాయిలో లేదు. ఆమె ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఆడియన్స్ విష్ణుప్రియ గేమ్ పట్ల సంతృప్తిగా లేరని తాజా ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. అనూహ్యంగా ఆమెతో ఓ సామాన్యుడు పోటీ పడుతున్నాడు. 

విష్ణుప్రియతో పోల్చుకుంటే నబీల్ ఒక సామాన్యుడు. అతడికి సోషల్ మీడియాలో ఓ మోస్తరు పాపులారిటీ ఉంది. బుల్లితెర ఆడియన్స్ కి నబీల్ ఎవరో తెలియదు. కేవలం తన ఆట తీరుతో నబీల్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడట. నిఖిల్ ని కూడా వెనక్కి నెట్టి టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట.తక్కువ ఓట్ల తేడాతో ప్రియాంక, నబీల్ ఒకటి రెండు స్థానాల్లో ఉన్నారట. 

గతంలో నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి విష్ణుప్రియ టాప్ లో ట్రెండ్ అయ్యింది. 40 శాతానికి పైగా ఓట్లు ఆమె ఒక్కదానికే పోల్ అయ్యేవి. ఈసారి ఆమె మూడో స్థానానికి పడిపోయిందట. నబీల్, నిఖిల్ తర్వాత విష్ణుప్రియకు ఓట్లు పడుతున్నాయట. ఇది ఊహించని పరిణామమే అని చెప్పొచ్చు. 
 


విష్ణుప్రియ పై నెగిటివిటీ రావడానికి ప్రేరణతో గొడవలు కూడా కారణం. వీరిద్దరూ దారుణమైన పదజాలంతో ఒకరినొకరు దూషించుకున్నారు. నాగార్జున ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. క్లాస్ పీకాడు. ఈ గొడవల అనంతరం విష్ణుప్రియపై ప్రేక్షకుల అభిప్రాయం మారి ఉండొచ్చు. అందుకే ఆమెకు తక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. 

నబీల్, నిఖిల్, విష్ణుప్రియ.. మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారట. ఇక నాలుగో స్థానంలో మణికంఠ ఉన్నాడట. మణికంఠకు ఆడియన్స్ లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ప్రతిసారి నామినేట్ అవుతున్నప్పటికీ ఆడియన్స్ ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు. 

నైనిక మొదట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. వారాలు గడిచే కొద్దీ ఆమె డల్ అవుతున్నారు. మిగతా లేడీ కంటెస్టెంట్స్ లో ఉన్న ఫైర్ ఆమెలో కనిపించడం లేదు. ఈ కారణంగా నైనికకు తక్కువ ఓట్లు పడుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

Latest Videos

click me!