తనకి నువ్వంటే చాలా ఇష్టం అని నేను తనకి సపోర్ట్ చేశాను. నువ్వు జగతిని ఇంటికి తీసుకొచ్చావు అయినా నేనేం అనలేదు, వసుధరతో ఎక్కువగా ఉండొద్దు అన్నాను,అయినా ఉన్నావు నేనేం అనలేదు. సాక్షికి నువ్వంటే ఇష్టమని సాక్షితో ఉండమన్నాను, అదీ నీ ఇష్టం. ఇప్పుడు నేను ఏమనలేను. కానీ ఇంత చేసినా, సాక్షి నా మీద కోప్పడి నన్ను జైల్ కి పంపిస్తా అంటుంది. ఇంకా నా దగ్గర ఉన్నవి రెండే మార్గాలు, ఒకటి నిన్ను సాక్షిని పెళ్లి చేసుకోమని అడగడం.