దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికమైంది. దీంతో పాక్షికంగా లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి రాష్ట్రాలు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తున్నాయి. ఢిల్లీ రాష్ట్రంలో పూర్తిగా థియేటర్స్ మూసివేశారు. ఇలాంటి ప్రతికూలతల మధ్య వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ లాంటి చిత్రాలు విడుదల చేయడం శ్రేయస్కరం కాదు. కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం ఖర్చుపెట్టిన ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు వేరే మార్గం లేక విడుదల వాయిదా వేశారు.