ఆ తర్వాత సీన్లో మాధవ్ ఇంట్లో కూర్చొని ఉంటాడు. నేను అంత చెప్పిన తర్వాత టక్కున వస్తాడు అనుకుంటే ఇంకా రాలేదేంటి మీ ఆఫీసర్ సార్ అని రుక్మిణితో అంటాడు మాధవ్. అప్పుడు ఆదిత్య అక్కడికి వస్తాడు. మాధవ్ ఆదిత్య తో రండి ఆఫీసర్ అని చెప్పి రాధా, వెళ్లి ఆఫీసర్ కి కాఫీ ఇవ్వు అసలుకే నీ చేతితో కాఫీ తాగి ఎన్ని రోజులైందో అని ఎటకారిస్తాడు. ఇంతట్లో పిల్లలు అక్కడికి వచ్చి ఆఫీసర్ సర్ వచ్చేసారా? నాయనా, మీరు మమ్మల్ని స్కూల్ కి దింపడానికి వచ్చారు అని చెప్పాడు అని అనగా మాధవ్, చిన్మయి నువ్వు కారులో వెళ్లి కూర్చో ఈలోగా ఆఫీసర్ సార్ వచ్చి మీ ఇద్దరినీ స్కూల్ కి తీసుకెళ్తాడు అని అంటాడు. దేవి అక్కడే ఉంటుంది ఈ లోగ నలుగురు అనాధ పిల్లలు మాధవ్ ఇంటికి వస్తారు. చేతిలో డొనేషన్ డబ్బాని పట్టుకుని, మేము అనాధ శరణాలయం నుంచి డొనేషన్ కోసం వచ్చాము సర్ అని అంటారు..