బాలయ్య - అనిల్ రావిపూడి చిత్రానికి కాజల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? తగ్గేదెలే!?

First Published | Feb 7, 2023, 6:47 PM IST

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ ఎప్పుడెప్పుడు వెండితెరపై మెరుస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ పెడుతున్నారు. అయితే ప్రస్తుతం కాజల్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
 

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ ఎప్పుడెప్పుడు వెండితెరపై మెరుస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. చివరిగా మెగాస్టార్ సరసన ‘ఆచార్య’లో కనిపిస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.  ఇక ప్రస్తుతం ఈ చందమామ సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్ ను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) సరసన ‘భారతీయుడు 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే.
 

ఇక రీసెంట్ బజ్ ప్రకారం.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడీగా తొలిసారిగా నటించబోతుందని తెలుస్తోంది. హీరోయిన్ గా కాజల్ ఫిక్స్ అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతోంది. దీంతో రీఎంట్రీ అదిరిపోనుందని అంటున్నారు. మరోవైపు బాలయ్య కూడా వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. 
 


అయితే, బాలయ్య సరసన కాజల్ నటించడానికి భారీ మొత్తంలోనే ఛార్జ్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటి ఆధారంగా.. పెళ్లి తర్వాత కూడా రెమ్యూనరేషన్ లో ఏమాత్రం తగ్గడం లేని తెలుస్తోంది. ఎన్బీకే108 చిత్రానికి రూ.కోటికిపైగానే అందుకుంటుందని ప్రచారం జరుగుతోంది.
 

పెళ్లికి ముందు కాజల్ సినిమాకు రూ.కోటికిపైగానే రెమ్యూరేషన్ అందుకునేది. ఇక పెళ్లితర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. అయితే బాలయ్య సరసన నటించే ఛాన్స్ రావడం.. పైగా మునుపటి స్థాయిలోనే రెమ్యూనరేషన్ కూడా అందుతుండటం విశేషం.  
 

kajal aggarwal

ఇక సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) రీసెంట్ గా ‘వీరసింహారెడ్డి’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. 

గత నెలలో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా శరవేగంగా షూటింగ్ కొనసాగిస్తున్నారు. బాలయ్య ఈసారి తెలంగాణ గడ్డపై గర్జించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని  షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
 

Latest Videos

click me!