Janaki kalaganaledhu: వెన్నెల ప్రియుడును చూసిన జ్ఞానాంభ.. జానకి ఎలా సహాయం చెయ్యనుంది?

Navya G   | Asianet News
Published : Feb 07, 2022, 02:37 PM IST

Janaki kalaganaledhu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు (janaki kalaganaledhu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్ ఏంటో చూద్దాం. జ్ఞానాంభ (gnanamba) రామచంద్రపురం వాళ్ళు ఎల్లుండి నిశ్చితార్థం అని చెప్పారని వెన్నెలకు చెబుతుంది. ఈ విషయం మీ నాన్నగారితో చెప్పు అని వెన్నెలతో అనగా వెన్నెల (vennela) షాక్ అవుతుంది.  

PREV
15
Janaki kalaganaledhu: వెన్నెల ప్రియుడును చూసిన జ్ఞానాంభ.. జానకి ఎలా సహాయం చెయ్యనుంది?

మరోవైపు జానకి, రామచంద్రలు ఇద్దరూ కలిసి టీ స్టాల్ దగ్గర టీ తాగడానికి వెళ్తారు. రామ చంద్ర టి ఆర్డర్ చేస్తాడు. ఇక రామచంద్ర (ramachandra) మీద కోపంతో జానకి కూడా కాఫి ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత రామచంద్ర, జానకి ను ఆట పట్టించడానికి తాను తాగిన టీ కు మాత్రమే డబ్బులు పే చేస్తాడు. దానికి జానకి (janaki) కాఫి కు బదులుగా డబ్బులు లేక తన చేతికున్న ఉంగరాన్ని ఇచ్చేస్తుంది.
 

25

ఆ తర్వాత ఇద్దరు వచ్చి కారులో కూర్చుంటారు. రామచంద్ర ఉంగరాన్ని టీ స్టాల్ వ్యక్తికి ఇవ్వడం ఇష్టంలేక  కారు దిగి తిరిగి వెళ్లి ఆ వ్యక్తిని ఫన్నీగా బ్రతిమి లాడుతూ చివరకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఉంగరాన్ని తీసుకుంటాడు. జానకి వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్నీ వార్ ను చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక రామచంద్ర (ramachandra) ఆ ఉంగరాన్ని తీసుకువచ్చి జానకి చేతిలో పెడతాడు.
 

35

దానికి జానకి, మీకు ఆటపట్టించడం రాదు అని వెక్కిరిస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళతారు. అక్కడ దేవుడికి దండం పెట్టుకున్న తరువాత కాస్త మనసులో ఆ కోపం తీసి కొంచెం నవ్వుతూ ఉండండి రామా గారు.. అని జానకి అంటుంది. కానీ రామచంద్ర జానకి (janaki kalaganaledhu) మీద కోపంతో అలాగే అలిగి ఉంటాడు.
 

45

ఆ తర్వాత జానకి, రామచంద్ర (ramachandra) మీద పూజకు కావలసిన నీళ్లు మోస్తుంస్తుంది ఆ టైమ్ లో జారి నీళ్ళలో పడి పోతూ ఉండగా రామచంద్ర వచ్చి తన బాడీని జానకి బాడీకి సపోర్ట్ చేసి కాపాడుతాడు. ఆ క్రమంలో లో జానకి కాలు బెనుకుతుంది. దాంతో రామచంద్ర, జానకిను (Janaki Kalaganaledhu) ఎత్తుకొని మరీ గుడి దగ్గరకు తీసుకొని వెళతాడు.
 

55

మరోవైపు మల్లిక స్విమ్మింగ్ పూల్ లో గోల చేస్తూ తన భర్తని చిరాకు పెడుతూ.. నీళ్లలోలోకి పడేస్తుంది. మరోవైపు జ్ఞానాంభ టేబుల్ పై ఉన్న గిఫ్ట్, గ్రీటింగ్ కార్డు ను చూస్తుంది. అదే క్రమంలో డస్క్ లో ఉన్న ఫోటోను కూడా చూసేస్తుంది మరి ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories