Guppedantha Manasu: జగతిని ఇంట్లో నుంచి పంపించడానికి సిద్ధమైన మహేంద్ర.. ఈ క్రమంలో ఏం జరిగిందంటే!

Navya G   | Asianet News
Published : Feb 07, 2022, 01:44 PM ISTUpdated : Feb 07, 2022, 02:36 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో అందరూ  కలిసి మహేంద్ర ను పాట పాడాలి అంటూ ఫ్యామిలీ అంతా టార్గెట్ చేస్తారు. ఇక మహేంద్ర  (Mahendra) ఆ టాపిక్ ను పిండి వంటలపై డైవర్ట్ చేస్తాడు.

PREV
16
Guppedantha Manasu: జగతిని ఇంట్లో నుంచి పంపించడానికి సిద్ధమైన మహేంద్ర..  ఈ క్రమంలో ఏం జరిగిందంటే!

ఆ తర్వాత వసు (Vasu) , రిషి సార్ కూడా పాటలు బాగా పాడతారు అని చెబుతోంది. దాంతో మహేంద్ర, రిషి రాగానే మీరందరూ కలిసి రిషిను పాట పాడడానికి ఒప్పించండి చూద్దాం..  అని అంటాడు. ఈలోపు అక్కడకు రిషి వచ్చేస్తాడు. ఇక రిషి  (Rishi) అందరూ ఇక్కడ ఉండగా పెద్దమ్మ ఒక్కతే గదిలో ఉండటం ఏమిటి అని ఆలోచించి తన పెద్దమ్మ దగ్గరికి వెళ్తాడు.
 

26

ఏమైంది పెద్దమ్మ అని రిషి (Rishi)  అడగగా.. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నేను నా కొడుకు దగ్గరికి వెళ్లి పోతాను అని చెబుతోంది. దాంతో రిషి మరి నేను ఎవరిని పెద్దమ్మా అని అడుగుతాడు. నువ్వు మారిపోయావు రిషి అంటూ.. కపట ప్రేమతో దేవయాని (Devayani) ఏడుస్తూ ఉంటుంది.
 

36

ఆ క్రమంలోనే పరాయి వ్యక్తులు వచ్చి ఇంట్లో ఉంటే ఈ ఇల్లు నాది కాదేమో..  నువ్వు నా కొడుకు కాదేమో అని అనిపిస్తుంది అని దేవయాని (Devayani) ఏడుస్తుంది. ఇదంతా మహేంద్ర ఒక దగ్గరి నుంచి వింటూ ఉంటాడు. ఇక దేవయాని తన మాటలతో రిషి  (Rishi) ను ఎమోషనల్ వలలో వేసుకుంటుంది.
 

46

అలా దేవయాని (Devayani)  మాటలకు కరిగిపోయిన రిషి పెద్దమ్మ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను అని ఏడుస్తూ దగ్గరకు తీసుకుంటాడు. ఆ మాటలు విన్న మహేంద్ర జరిగిన సంగతి జగతికి (Jagathi) కి చెప్పి జగతిను ఇంట్లోంచి పంపించడానికి సిద్ధం చేస్తాడు.
 

56

ఇక మహేంద్ర (Mahendra), జగతి బ్యాగ్ ను తీసుకొని రిషి దగ్గరకు వచ్చి రిషిక అర్థమయ్యేలా డబల్ మీనింగ్ లో  చెప్పి జగతి వెళ్ళిపోయే సమయం వచ్చిందని చెబుతాడు. జగతి వెళ్లి పోతుంది అన్న సంగతి తెలిసి  ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. కానీ దేవయాని (devayani) ఏమీ తెలీనట్లు ఉంటుంది. 
 

66

ఇక దేవయాని (Devayani)  భర్త, జగతి ఇంట్లో నుంచి వెళ్లడం అసలు యాక్సెప్ట్ చేయలేక పోతాడు. ఈ క్రమంలోనే మహేంద్ర కూడా జగతి ఈ ఇంట్లోకి వచ్చినందుకు, వచ్చేలా చేసిన వాళ్లకి థాంక్స్ అని రిషి (Rishi)  కు అర్థమయ్యేలా చెబుతాడు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories