ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక అప్పుడప్పుడు ఇలా తలను గోడకేసి కొట్టుకుంటూ ఉంటే కడుపులోని బిడ్డకు మంచిది అనడంతో వెంటనే విష్ణు అవునా కడుపులో బిడ్డకు మంచిది అంటే నువ్వు సరిగ్గా కొట్టుకున్నావో లేదో గోడ ఎక్కడ ఉంది నేను ట్రై చేస్తాను అని అనగా ఏవండీ ఇప్పుడు వద్దు ఈసారి నాది అయిపోయింది ఒక్కొక్కసారి తండ్రి కూడా తల కొట్టుకోవాలంట మీరు కొట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మల్లిక. అప్పుడు విష్ణు దీన్ని కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి వింత వింతగా ప్రవర్తిస్తుంది దీని భరించడం నా కర్మ అనుకుంటూ ఉండగా మల్లిక విష్ణు అని పిలుస్తుంది.