తిరగబెట్టిన గాయం, ప్రభాస్ కి మరోసారి సర్జరీ? కల్కి వాయిదా పడనుందా?

First Published | Jan 19, 2024, 11:39 AM IST

ప్రభాస్ ఇటీవల విదేశాల్లో సర్జరీ చేయించుకున్నాడు. అయితే గాయం తిరగబెట్టగా మరలా ఆపరేషన్ తప్పదంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 


పాత్ర కోసం కష్టపడే హీరోల్లో ప్రభాస్ ఒకరు. బాహుబలి సిరీస్ లో ఆయన చెమటోడ్చారు. శివుడు పాత్రలో సన్నగా కనిపించే ప్రభాస్ బాహుబలి పాత్రలో మాత్రం భారీ కాయంతో దర్శనం ఇచ్చాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రభాస్ కష్టపడాల్సి వచ్చింది. 
 

గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేశాడు. ప్రభాస్-రానా లకు రాజమౌళి చుక్కలు చూపించాడు. తాను కోరుకున్న విధంగా వాళ్ళను మార్చే క్రమంలో విపరీతంగా కష్టపెట్టాడు. యుద్ధ విద్యల్లో శిక్షణ ఇప్పించాడు. అప్పుడే ప్రభాస్ కి మోకాలి నొప్పి సమస్య మొదలైందట. 


చాలా కాలంగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రత పెరగడంతో వైద్యులు సర్జరీ సూచించారు. గత ఏడాది ప్రభాస్ విదేశాల్లో సర్జరీ చేయించుకున్నారు. ఒక నెల రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. సలార్ విడుదలకు ముందు ఇండియా వచ్చారు. 

prabhas


సలార్ ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొనలేదు. జస్ట్ రాజమౌళి ఇంటర్వ్యూతో సరిపెట్టాడు. గాయం కారణంగానే ప్రభాస్ సలార్ ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడనే వాదన వినిపించింది. కల్కి 2829 AD, రాజా సాబ్ చిత్రాల షూటింగ్స్ లో ప్రభాస్ పాల్గొంటున్నట్లు సమాచారం. 
 

prabas

దీంతో ఆయన మోకాలి గాయం తిరగబెట్టిందట. మరలా సర్జరీ అవసరం అట. మరోసారి ప్రభాస్ విదేశాలకు వెళ్లనున్నారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. 

మరి అదే నిజమైతే కల్కి విడుదల తేదీ మారే సూచనలు కలవు. సమ్మర్ కానుకగా కల్కి మే 9న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ప్రభాస్ కి సర్జరీ జరిగి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే... విడుదల తేదీ వాయిదా పడటం ఖాయం. ఆల్రెడీ కల్కి 2024 సంక్రాంతి నుండి మే 9కి వాయిదా పడిన విషయం తెలిసిందే... 

Latest Videos

click me!