ఎన్టీఆర్, శోభన్ బాబు, బాలయ్య, తారక్ , ప్రభాస్..రాముడిగా వెండితెరపై ఎవరు బెస్ట్.. ?

First Published | Jan 19, 2024, 10:56 AM IST

అయోధ్య రాముడు, సుదర రాముడు.. జగదభిరాముడు.. సీతారాముడి అద్భుత చరిత్రను వెండితెరపై  దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన వారు ఎందరో.. స్టార్ హీరోలు రాముని అవతారంలో కనిపించి మురిపించారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి.. ప్రభాస్ వరకూ రామాయణ గాథలతో వచ్చిన సినిమాలు గురించి చూద్దాం..? 

సినిమా చరిత్రలో అద్భుత దృశ్యకావ్యాలెన్నె.. అందులో అయోధ్య రాముడిపై వచ్చన సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. త్వరలో అయోధ్యలో రాముడి పట్టాభిషేకం జరగబోతోంది. భరతదేశ ప్రజలు పులకించిపోయే అద్భుత ఘట్టం కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఈ కార్యక్రమంలో సినీతారలు కూడా తమ వంతుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ఇక ఈ సందర్భంగా వెండితెరపై మెరిసిన శ్రీరాములు.. రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సినిమాల గురించి చూద్దాం.
 

తెలుగు తెరపై ఇప్పటికీ రామాయణం క్రేజ్ తగ్గలేదు.. రాముడిపై  ఉన్న ప్రేమ.. భక్తి తగ్గలేదు అనడానికి తాజాగా నిదర్శణాలు ఉన్నాయి. అందుకు బెస్ట్ ఎక్జాంపుల్  రెబల్ స్టార్ ప్రభాస్  నటించిన ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభు శ్రీరామ్ పాత్రలో కనిపించి మెప్పించాడు యంగ్ రెబల్ స్టార్.  రాముడిగా ఆరడుగుల అందగాడు ప్రభాస్ ను చూసిన దిల్ ఖుష్ అయ్యారుఫ్యాన్స్. ఇక  మరోవైపు అల్లు అరవింద్ కూడా  రామయణం మూవీ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అందులో రణ్‌బీర్ కపూర్, యశ్ రాముడిగా.. రావణాసురుడిగా  నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
 


వెండితెరపై శ్రీరాముడు అంటే ముందుగా మన కనుల ముందు మెదిలే హీరో సీనియర్ ఎన్టీఆర్. రాముడే కాదు.. కృష్ణడు అన్నా కూడా ఎన్టీఆర్ మాత్రమే మన కన్నుల ముందు మెదులుతారు. ఆయన పేరులోనే తారకరాముడు ఉన్నాడు. ఇక  శ్రీరాము పాత్రలను అద్భుతంగా పోషించిన పెద్దాయన.. రావణాసుడిగా కూడా నటించి మెప్పించారు.
 

ఎన్టీఆర్ తొలిసారి  సంపూర్ణ రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, రామాంజనేయం యుద్ధం వంటి పలు సినిమాల్లో రాముడి పాత్రలో ఎన్టీఆర్ మెప్పించడం విశేషం.  తెలుగువాళ్లకు రాముడంటే వల్లమాలిన అభిమానం. లవకుశ నుంచి నేటి ఆదిపురుష్   వరకు రామగాధను కళ్ళకు కట్టినవే.  రాముడి గొప్పతనాన్ని తెలిపినవే.

శ్రీరామ పాదుకా పట్టాభిషేకం తొలిసారిగా రాముడు వెండితెరపై కనిపించిన సినిమా..  1932లో ఈమూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ  రాముని పాత్రలో తొలిసారి కనిపించారు.ఇక ఆతరువాత ఎంత మంది రాముడి పాత్రలో కనిపించినా. .నిజమైన రాముడు అని ఎన్టీఆర్ కే పేరు వచ్చింది. అంతే కాదు.. తిరుపతి దర్శనానికి వెళ్ళిన జనాలు అటు నుంచి చెన్నై వెళ్ళి రామారావు దర్శనం కూడా చేసుకునేవారట. 

ఎన్టీఆర్ తరువాత చాలా మంది రాముడి పాత్రల్లో మెప్పించారు. ఆయనంత కాకపోయినా.. పర్వాలేదు అనిపించారు. అందులో ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ  బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం సినిమాలో రాముడిగా మెప్పించారు. లవకుశ సినిమాకు రీమేక్ గా తీసిన ఈ చిత్రంలో జగదేకవీరుడైన రాముడి పాత్రలో బాలకృష్ణ అద్భుతాభినయం చేసారు. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. 

ఇక చాలామందికి తెలుసో తెలియదో.. జూనియర్ ఎన్టీఆర్ కూడా శ్రీరాముడిగా నటించి మెప్పించాడు. అవును గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ బాల రాముడిగా నటించిన సినిమా బాల రామాయణం. ఒక రకంగా చెప్పాలంటే తారక్ తన సినీజీవితాన్ని రాముడి పాత్రతో  స్టార్ట్ చేశారనే చెప్పాలి. తాత పేరు.. రాముడి అంశ..తనకుకలిసి వచ్చిన శ్రీరాముడి పేర్లను తన కొడుకులకు పెట్టకున్నాడు ఎన్టీఆర్. అభినవ్ రామ్.. భార్గవ్ రామ్ అంటూ నామకరణం చేశాడు. 
 

రాముడిగా నటించిన మరో హీరో శ్రీకాంత్. రామాయణం అంటే రాముడి నడిచిన మార్గం అనే అర్థం వుంది. అటువంటి పుణ్యకథను సినిమాగా  తీయడానికి.. పాత్ర  చేయడానికి ఎవరు నో అంటారు చెప్పండి. శ్రీకాంత్ కూడా ఓ సందర్భంలో రాముడిగా నటించి మెప్పించాడు.  శ్రీకాంత్ ‘దేవుళ్లు’ సినిమాలో రాముడిగా కాసేపు కనిపించి మెప్పించడం విశేషం.

ఇక మైథాలాజికల్ క్యారెక్టర్స్ కరెక్టగా సూట్ అయ్యే మరో హీరో సుమన్. అన్నమయ్యలో శ్రీవేంకటేశ్వర స్వామి.. నిజంగా కిందకు దిగి వచ్చాడా అన్నట్టుగా నటించాడు సుమన్. ఇక ఆతరువాత వచ్చిన శ్రీరామదాసు సినిమాలో భద్రాద్రి రాముడిగా కనిపించి.. భక్తులు మైమరచిపోయేలా చేశాడు.  ఉత్తరాది వాళ్లకు అయోధ్య ఎలాగో…దక్షిణాది వారికి భద్రాచలం అంతే. ఇక భద్రాచలం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు  వెండితెరను రామమయం చేశాయి. ఇదే భద్రాద్రి నేపథ్యంలో తెరకెక్కిన శ్రీరామదాసు సినిమాలో సుమన్ శ్రీరామచంద్రుడి పాత్రలో అలరించారు.
 

ఎన్టీఆర్ తరువాత ఆ తరం నటులలో రాముడిగా మెప్పించగలిగింది శోభన్ బాబు అనే చెప్పాలి.  సంపూర్ణ రామాయణం’లో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత శోభన్ బాబుకే చెల్లింది.  ఇక శోభన్ బాబు మాత్రమే కాదు.. ఎన్టీఆర్ తరువాత రాముడిగా.. ఒకరకంగా చెప్పాలంటే.. ఎన్టీఆర్ కంటే ముందే రాముడిగా అలరించారు హరినాథ్ బాబు. ప్రతీ శ్రీరామ నవమికీ.. సీతారాములు కళ్యాణం చూదమురారండీ అని వినిపించే పాటలోన...మనోహరంగా కనిపించే ఆ శ్రీరామచంద్ర మూర్తి హరినాథ్ బాబే. 

అప్పటి వాళ్లకే కాదు. ఇప్పటి వాళ్లు కూడా రాముడు గొప్పవాడు.. ఆదర్శప్రాయుడు.. అయోధ్య నగరి నుంచి దేశాన్ని ఏలడానికి మరోసారి పట్టాభిషక్తుడు అవుతున్నాడు. ఈనెల 22 నుంచి అయోధ్యలో కొలువుచేయబోతున్నాడు. దేశ విదేశాల నుంచి వేల మంది సెలబ్రిటీలు రాగా.. లక్షల మంది రామ మందిర ద్వారా  ముందు ఎదరు చూడగా.. కోట్ల మంది వీక్షకుల నడుమ అయోధ్యలో బాలరాముడు.. రామ్ లాలాగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇదీ వెండితెరపై తెలుగు రాముడి లీల.

Latest Videos

click me!