Rashmika Mandanna : ‘పుష్ప2’పై అప్డేట్ ఇచ్చిన రష్మిక మందన్న.. శ్రీవల్లి ఏం చెప్పిందంటే?

Published : Jan 19, 2024, 11:16 AM IST

‘పుష్ప2’ కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రష్మికమందన్న Rashmika mandanna  ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది. 

PREV
16
Rashmika Mandanna :  ‘పుష్ప2’పై అప్డేట్ ఇచ్చిన రష్మిక మందన్న.. శ్రీవల్లి ఏం చెప్పిందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)   అభిమానులు Pushpa 2 The Rule కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

26

అయితే, ఈ మూవీ షూటింగ్ ఆ మధ్యలో కేశవా అరెస్ట్ తో ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. రీసెంట్ మళ్లీ ప్రారంభమైందనే సమచారం కూడా అందింది. ఈ క్రమంలో రష్మిక మందన్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో Pushpa 2పై అప్డేట్ అందించారు. 
 

36

రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘పుష్ప2 విషయంలో ప్రామీస్ చేస్తున్నాను. చాలా పెద్ద సినిమా ఇది. మీ ఎంటర్ టైన్ మెంట్ కు ఎలాంటి ఢోకా లేదు. అంచనాలను రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను తాజాగా పుష్ప2లో ఓ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశాను

46

సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఇది ముగింపులేని కథ. ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. మంచి సినిమాను అందించేందుకు డైరెక్టర్ సుకుమార్ సార్ ఎంతగానో కష్టపడుతున్నారు. పుష్ప2లో నాపాత్ర మరింత ఆకట్టుకునేలా ఉంటుంది.’ అని ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. 
 

56

ఈ చిత్రాన్ని 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

66
Srivalli

సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, అనసూయ, సునీల్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories