బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న సన్నీ (Sunny)పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతుంది. ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుండగా, సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. అదే సమయంలో సన్నీ కెరీర్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు. అయితే గత బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ కెరీర్ ఆధారంగా కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఆ నలుగురు చేయలేనిది ప్రత్యేకంగా సన్నీ పొడిచేదేంటని సైటర్లు వేస్తున్నారు.