Ram Charan-RRR : రామ్‌చరణ్‌కి వంద కోట్ల ఆఫర్‌.. ముంబయిలో ఫ్యాన్స్ రచ్చకి కారణమదేనా?

First Published | Dec 20, 2021, 4:23 PM IST

రామ్‌చరణ్‌ చరణ్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆయన రేంజ్‌ మారబోతుంది. ఈ సినిమా రిలీజ్‌కి ముందే చరణ్‌ రేంజ్‌ మారిపోయింది. ఫాలోయింగ్‌ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అందుకు నిదర్శనమే `ఆర్‌ఆర్‌ఆర్‌` ముంబయి ఈవెంట్‌. 

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం ముంబయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేడుకలో ముంబయిలో మన హీరోల పవరేంటో చూపించారు ఇద్దరు హీరోల అభిమానులు. ఇక్కడి నుంచి భారీగా తరలివెల్లడంతోపాటు స్థానికంగా అక్కడ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడిందని చెప్పొచ్చు. 
 

ఆదివారం ఈవినింగ్‌ జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చరణ్‌ ఫ్యాన్స్ సైతం భారీగా తరలివచ్చారు. అభిమాన నటుడిని చూసేందుకు ఎగబడ్డారు. అభిమానుల తాకిడికి బారికేడ్లు సైతం విరిగిపోవడం, గ్లాసులు పగిలిపోవడం గమనార్హం. ముంబయి ఈవెంట్‌లో చరణ్‌ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వారిని కంట్రోల్‌ చేయడం కూడా సాధ్యం కాలేదు. మరోవైపు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సైతం రెచ్చిపోవడంతో ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 
 


మన హీరోలు ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌`తో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కూడా మనవాళ్ల సత్తా ఏంటో చూపించేందుకు నడుం బిగించారు అభిమానులు. అయితే చరణ్‌కి ఇప్పటికే బాలీవుడ్‌లో మార్కెట్‌ ఉంది. ఫాలోయింగ్‌ ఉంది. ఆయన బాలీవుడ్‌లో ఏకంగా గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాతో కలిసి `తుఫాన్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇద్దరు హీరోల కటౌట్లు ముంబయి ఈవెంట్‌ వద్ద వెలియడం మరో విశేషంగా చెప్పొచ్చు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` దెబ్బతో చరణ్‌ రేంజ్‌ పాన్‌ ఇండియాని మించబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో `ఆర్ సీ 15`లో నటిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా చిత్రం. శంకర్‌ మార్క్ భారీ స్కేల్‌లో ఈ చిత్ర ఉండబోతుంది. భారీ కాస్టింగ్‌ ఉండటంతో ఈ సినిమా స్థాయి నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని చెప్పొచ్చు.  అంతేకాదు రామ్‌చరణ్‌ నెక్ట్స్ మూవీ కూడా పాన్‌ ఇండియాని మించి ఉండబోతుందని సమాచారం. 

రామ్‌చరణ్‌ .. శంకర్ చిత్రం తర్వాత `జెర్సీ` ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి బాలీవుడ్‌లో `జెర్సీ` రీమేక్‌ చేస్తున్నారు. ఇది రిలీజ్‌ కి రెడీ అవుతుంది. ఆ తర్వాత వెంటనే రామ్‌చరణ్‌ సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, ప్రమోద్‌ నిర్మించబోతున్నారు.
 

ఈ సినిమా గురించి గౌతమ్‌ చెబుతూ, ఇది పాన్‌ ఇండియా సినిమాని మించిఉండబోతుందని ఇటీవల ఓ బాలీవుడ్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది `బిగ్గర్‌ దెన్‌ పాన్‌ ఇండియా` అని పేర్కొన్నారు. దీంతో సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం చరణ్‌కి ఫాలోయింగ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఆయనకు పారితోషికం కూడా పెరుగుతుందని, పలువురు మేకర్స్ వంద కోట్ల ఆఫర్ చేసినట్టు టాలీవుడ్‌ టాక్‌. అది గౌతమ్‌ తిన్ననూరి సినిమానే అనే టాక్‌ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో `ఆర్‌ఆర్‌ఆర్` జనవరి 7న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన `ఆచార్య`లో సిద్ధగా కీలక పాత్ర పోషిస్తున్నారు చరణ్‌. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది నుంచి బ్యాక్ టూ బ్యాక్‌ సందడి చేయబోతున్నారు చరణ్‌.

Latest Videos

click me!