Suriya Jyotika Mumbai House: భార్య కోసం షాకింగ్ డెసిషన్.. సూర్య రూ.200 కోట్ల ఇల్లు ఎందుకు వదిలేశాడో తెలుసా ?

Published : Sep 20, 2026, 06:34 PM IST

స్కాట్లాండ్‌లో తమ పెళ్లి ప్రమాణాలను మళ్లీ చేసుకున్న సూర్య - జ్యోతిక జంట, చెన్నైలోని రూ.200 కోట్ల బంగ్లాను వదిలేసి ముంబైలోని 1,700 చదరపు అడుగుల చిన్న ఫ్లాట్‌కి ఎందుకు మారారనే విషయం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

PREV
15
సూర్య 200 కోట్ల ఇల్లు

స్కాట్లాండ్‌లోని 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్లెయిర్‌క్వాన్ (Blairquhan) కోటలో సూర్య, జ్యోతిక రీసెంట్‌గా తమ 20వ పెళ్లి ప్రమాణాలను మళ్లీ చేసుకున్నారు (Renewed their vows). క్రిస్టియన్ పద్ధతిలో జరిగిన ఈ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జంట ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

బంధాలు త్వరగా విడిపోతున్న ఈ రోజుల్లో, వీరి 20 ఏళ్ల వైవాహిక బంధం నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకపక్క వీరి పెళ్లి ఫొటోలు ట్రెండ్ అవుతుండగానే, రూ.200 కోట్ల విలువైన చెన్నై బంగ్లాను వదిలేసి ముంబైలో కేవలం 1,700 చదరపు అడుగుల ఫ్లాట్‌కి ఎందుకు మారారంటూ సూర్య గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

25
భార్య కోసం షాకింగ్ డెసిషన్

దాదాపు ఏడాది క్రితం 'ది హాలీవుడ్ రిపోర్టర్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య ఈ విషయాన్ని బయటపెట్టారు. కరోనా టైమ్‌లో చెన్నై వదిలి ముంబైకి ఎందుకు మారాల్సి వచ్చిందో ఆయన క్లియర్‌గా చెప్పారు.

జ్యోతిక గురించి సూర్య మాట్లాడుతూ.. "తను 18-19 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చింది. 27 ఏళ్లు చెన్నైలోనే ఉంది. తన జీవితంలో కేవలం 18 ఏళ్లు మాత్రమే ముంబైలో గడిపింది. నా కోసం, నా కుటుంబం కోసం తన కెరీర్, స్నేహితులు, బంధువులు, బాంద్రా లైఫ్‌స్టైల్ అన్నీ వదిలేసి చెన్నైకి వచ్చేసింది. ఇప్పుడు ముంబైకి మారడం వల్ల 27 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం జ్యోతికకు దొరికింది" అని సూర్య ఎమోషనల్ అయ్యారు.

35
అందుకే ముంబైకి వెళ్ళా

ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనను సూర్య పంచుకున్నారు. "ఒక మగాడికి ఏమేం అవసరమో, అవన్నీ ఒక ఆడదానికి కూడా అవసరమే. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం సమయం పట్టింది. ఆమెకు కూడా వెకేషన్స్, ఫ్రెండ్స్ సర్కిల్, ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. ఆత్మగౌరవం, జిమ్, ఆరోగ్యం, తనకంటూ కొంత పర్సనల్ టైమ్ (Me time) చాలా ముఖ్యం" అని సూర్య చెప్పారు.

"మగవాళ్లుగా మనం ఏమైతే కోరుకుంటామో, ఆడవాళ్లకూ అవే కావాలి. తన తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని, తన లైఫ్‌స్టైల్‌ను మనం ఎందుకు దూరం చేయాలి? ఆ మార్పు మనం ఎప్పుడు తీసుకొస్తాం? ఎప్పుడూ నా కోసమే ఎందుకు బతకాలి? ఈ ఆలోచనే మమ్మల్ని ముంబైకి వెళ్లేలా చేసింది. ఇప్పుడు ఒక నటిగా ఆమె ఎదుగుదలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది" అని సూర్య అన్నారు.

45
ముంబైలో చాలా స్వేచ్ఛగా తిరగొచ్చు

చెన్నైలో బయటకు వెళ్తే అభిమానులు గుర్తుపట్టి చుట్టుముడతారు. కానీ ముంబైలో చాలా స్వేచ్ఛగా తిరగొచ్చు. అందుకే సూర్యకు ముంబై లైఫ్ బాగా నచ్చింది. సూర్యకు ముంబై సిటీ అంటే చాలా ఇష్టమని జ్యోతిక తనతో చెప్పినట్లు నటి, సూర్య సన్నిహితురాలు రాధికా శరత్‌కుమార్ ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో చెప్పారు.

దీనిపై సూర్య స్పందిస్తూ.. చెన్నైలోని రూ.200 కోట్ల బంగ్లా కంటే ముంబైలోని 1,700 చదరపు అడుగుల ఇల్లు తనకెందుకు ఇష్టమో వివరించారు. "ముంబై నాకు ఒక వెకేషన్ స్పాట్ లాంటిది. నేను ఇక్కడ (చెన్నైలో) పని చేస్తాను, రెస్ట్ కోసం అక్కడికి (ముంబైకి) వెళ్తాను. అది చాలా చిన్న ఇల్లు. మేం 1,700 చదరపు అడుగుల ఇంట్లోనే ఉంటున్నాం" అని సూర్య చెప్పారు.

55
అదే ప్రధాన ఉద్దేశం

"బెడ్‌రూమ్‌కి రెండు అడుగులు, హాల్‌కి రెండు అడుగులు, కిచెన్‌కి రెండు అడుగులు, డైనింగ్ ఏరియాకి రెండు అడుగులు... అన్నీ చాలా దగ్గరగా ఉండే అందమైన, వెచ్చని ఇల్లు అది. ఆ ఇల్లు మాకు ఎంతో ప్రశాంతతను, బోలెడన్ని జ్ఞాపకాలను, అంతులేని ప్రేమను ఇస్తోంది. దియా లేదా దేవ్‌ను పిలవాలంటే వెంటనే పలకవచ్చు, వాళ్లు ఒక్క అడుగు దూరంలోనే ఉంటారు" అని సూర్య చెప్పారు.

"మేం అక్కడ ఏం చేస్తున్నామో చాలామందికి తెలియదు, అందుకే అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముంబైకి మారిన తర్వాత సూర్య, జ్యోతిక చాలా సంతోషంగా ఉన్నారని రాధిక కూడా చెప్పారు. జ్యోతిక తల్లిదండ్రులతో సమయం గడపడమే మా ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో అక్కడ సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి" అని సూర్య స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories