ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నటి శ్రుతి హాసన్, తాజాగా తన మాతృత్వపు కలల గురించి ఓపెన్ అయ్యారు. `అవసరమైతే పిల్లను దత్తత తీసుకునైనా సరే, నేను తల్లిని కావాలనుకుంటున్నాను` అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సినిమాలు, పర్సనల్ లైఫ్, ఆరోగ్యం.. ఇలా ఏ టాపిక్ అయినా బోల్డ్‌గా మాట్లాడే శ్రుతి హాసన్, ఇప్పుడు తన మాతృత్వం గురించి మనసు విప్పారు. "దత్తత తీసుకునైనా సరే నేను తల్లిని కావాలి" అని ఆమె అన్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ నిర్ణయం వెనుక ఆమె ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఆరోగ్య సమస్యల ఆందోళన దాగి ఉండటం ఆసక్తిగా మారింది.
26
చిన్నప్పట్నుంచే వెంటాడుతున్న భయం
40 ఏళ్ల శ్రుతి హాసన్, మాతృత్వం గురించి తన ఆలోచనలు ఎన్నో ఏళ్లుగా పీసీఓఎస్ (Polycystic Ovary Syndrome) చుట్టే తిరుగుతున్నాయని చెప్పారు. టీనేజ్‌లోనే భవిష్యత్తులో తాను తల్లి కాగలనా లేదా అనే భయం తనను వెంటాడిందని ఆమె వివరించారు.
36
సహజంగా తల్లి కావడం కష్టమే
సోహా అలీ ఖాన్ లేటెస్ట్ పాడ్‌కాస్ట్‌లో శ్రుతి మాట్లాడుతూ.. తనకు కేవలం 14 ఏళ్ల వయసులోనే పీసీఓఎస్, ప్రెగ్నెన్సీకి మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసిందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సహజంగా తల్లి కావడం కష్టమేమో అనే ఫీలింగ్ ఎన్నో ఏళ్ల పాటు తన మనసులో ఉండిపోయిందని చెప్పారు.
అయితే, గైనకాలజిస్ట్ డాక్టర్ ధృప్తి దేధియాను కలిశాక శ్రుతి ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందట. తల్లి కావాలనే ఆశను వదులుకోకుండా, ఎప్పుడు రెడీ అనుకుంటే అప్పుడు ఆ దిశగా అడుగులు వేయొచ్చని డాక్టర్ తనకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.
56
శ్రుతి కళ్లు తెరిపించిన డాక్టర్
"నాకు 14 ఏళ్లు ఉన్నప్పటి నుంచి తల్లి కావడం చాలా కష్టమని అనుకునేదాన్ని. కానీ డాక్టర్ నా కళ్లు తెరిపించారు. నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటే, అప్పుడు తల్లి అయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు" అని శ్రుతి వివరించారు.
66
పిల్లల్ని దత్తత కూడా తీసుకునేందుకు శ్రుతి హాసన్ రెడీ
సహజంగా తల్లి అయ్యేందుకు ప్రయత్నించడంతో పాటు, పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధమేనని శ్రుతి క్లారిటీ ఇచ్చారు. `నేను నిజంగానే తల్లిని కావాలనుకుంటున్నాను. నేచురల్ ట్రై చేస్తాను. కానీ, దత్తత తీసుకునే ఆలోచన కూడా నాకు ఉంది` అని ఆమె స్పష్టం చేశారు. శ్రుతి హాసన్ మాటలు కేవలం మాతృత్వంపై ఆమెకున్న ఇష్టాన్ని మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల భయాన్ని జయించి భవిష్యత్తును పాజిటివ్‌గా చూస్తున్న ఆమె ధైర్యాన్ని కూడా చూపిస్తున్నాయి.