చిరంజీవి కాదు, నాగార్జునకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? అన్నయ్య అని ఆ ఒక్క నటుడినే పిలిచేవాడు!

First Published | Oct 7, 2024, 10:52 AM IST

నాగార్జునకు ఓ హీరో అంటే అత్యంత ఇష్టం అట. ఆయనను తప్ప పరిశ్రమలో ఎవరినీ అన్నయ్య అని పిలవనని నాగార్జున ఓ సందర్భంలో స్వయంగా చెప్పారు. 
 

Nagarjuna Akkineni

కింగ్ నాగార్జున టాలీవుడ్ టాప్ స్టార్. తన ఇమేజ్ ఛట్రం నుండి బయటకు వచ్చి ప్రయోగాత్మక చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. నాగార్జునకు మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. అమ్మాయిల కలల రాకుమారుడు. మజ్ను, గీతాంజలి చిత్రాలతో క్లాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. 
 

జానకి రాముడు, కిల్లర్, శివ, అంతం, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, హలో బ్రదర్స్... నాగార్జునను మాస్, కమర్షియల్ హీరోగా మార్చాయి. తండ్రి నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నిలబెడుతూ నాగార్జున అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగారు. నాగార్జున నటించిన అన్నమయ్య భక్తిరస చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్. నాగార్జున ఇమేజ్ కి అన్నమయ్య పాత్ర చేసి విజయం సాధించడం గొప్ప పరిణామం. 

నాగార్జున కెరీర్లో అన్నమయ్య మైలురాయిగా నిలిచిపోయింది. నాగార్జున వ్యాపారవేత్త కూడాను. అన్నపూర్ణ స్టూడియో ద్వారా పరిశ్రమకు తనదైన సేవలు అందిస్తున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున పదుల సంఖ్యలో చిత్రాలు, సీరియల్స్ నిర్మించారు. అటు టెలివిజన్ హోస్ట్ గా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. 


2014లో మొదటిసారి మీలో ఎవరు కోటీశ్వరుడు? షో తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. కోన్ బనేగా కరోడ్ పతి కి ఇది తెలుగు వెర్షన్ అని చెప్పవచ్చు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో నాగార్జున హోస్టింగ్ చాలా ఆకర్షణీయంగా ఉండేది. ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. 

ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 2017లో సీజన్ వన్ ప్రసారం కాగా ఎన్టీఆర్ హోస్ట్. ఇక సీజన్ 2కి నాని హోస్ట్ గా ఉన్నారు. 2019 నుండి ఆ బాధ్యత నాగార్జున తీసుకున్నారు. సీజన్ 8 ప్రసారం అవుతుండగా... వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 
 

Nagarjuna Akkineni

నాగార్జున కలుపుగోలు మనిషి. ఇతర నటులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తెలుగు సినిమాను దశాబ్దాల పాటు ఏలిన హీరోలు. వీరి మధ్య స్నేహం ఉంది. ముఖ్యంగా నాగార్జున-చిరంజీవి చాలా క్లోజ్. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు  కూడా చేశారని సమాచారం. తరచుగా కలుస్తూ ఉండేవారు. 

అయితే నాగార్జునకు చిరంజీవి కంటే అత్యంత ఇష్టమైన నటుడు వేరొకరు ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. నందమూరి హరికృష్ణ అంటే నాగార్జున చాలా ఇష్టమట. ఒకసారి ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు? షోకి గెస్ట్ గా వచ్చాడు. హోస్ట్ గా ఉన్న నాగార్జున ఈ విషయాన్ని ఎన్టీఆర్ తో పంచుకున్నాడు. 

Nagarjuna Akkineni

నాగార్జున మాట్లాడుతూ... మీ నందమూరి కుటుంబంలో నాకు నచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.. మీ నాన్న హరికృష్ణ. ఆయనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ. సీతారామరాజు మూవీ కలిసి చేశాక, ఆ ఇష్టం ఇంకా పెరిగింది. హరికృష్ణను నేను అన్నయ్య అని పిలుస్తాను. పరిశ్రమలో ఇంకెవరినీ అలా పిలవను... అన్నారు. 

దానికి సమాధానంగా.. నేను సీతారామరాజు షూటింగ్ కి వచ్చినప్పుడు చూశాను. ఆయన కూడా మిమ్మల్ని తమ్ముడు తమ్ముడు... అంటుండేవారు, అని ఎన్టీఆర్ అన్నారు. వై వి ఎస్ చౌదరి తెరకెక్కించిన సీతారామరాజు మంచి విజయం సాధించింది. నాగార్జున-హరికృష్ణ అన్నదమ్ముల పాత్రలు చేశారు. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

Nagarjuna Akkineni

ఎన్టీఆర్-నాగార్జున కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. అఖిల్ నటించిన ఓ మూవీ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరయ్యాడు. నాగార్జునను ఎన్టీఆర్ బాబాయ్ అని పిలుస్తాడు. అదే సమయంలో బాలయ్యను నాగార్జున ఇష్టపడరనే వాదన ఉంది. వీరిద్దరు కలిసిన సందర్భాలు చాలా అరుదు. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాలకు కూడా నాగార్జున హాజరు కాలేదు. 

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు నాగ చైతన్య, అఖిల్ హాజరయ్యారు. నాగార్జున వెళ్ళలేదు. ఇటీవల ఘనంగా నిర్వహించిన బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున, ఎన్టీఆర్ గైర్హాజరయ్యారు. 
 

Latest Videos

click me!