Tabu: చిరంజీవితో ఇండస్ట్రీ హిట్‌ కోల్పోయిన టబు, కొంప ముంచిన స్టార్‌ హీరోయిన్‌.. లేదంటే టాలీవుడ్‌ క్వీన్‌ తనే

Published : Apr 01, 2026, 10:27 AM IST

టబు తెలుగులో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేసింది. కానీ తెలుగులో పెద్ద స్టార్‌ అయ్యే ఛాన్స్ ని మిస్‌ చేసుకుంది. చిరంజీవితో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాల్సిన అవకాశం మిస్‌ అయ్యింది. 

PREV
15
టాలీవుడ్‌లో సెలక్టీవ్‌గా మూవీస్‌ చేసిన టబు

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ టబు తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే. నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణలతో నటించింది. చిరంజీవితోనూ `అందరివాడు`లో మెరిసింది. కానీ నాగ్‌ తో రెండు సినిమాలు, బాలయ్యతో రెండు సినిమాలు చేసింది. కానీ నాగార్జునతో అనేక రూమర్లని ఫేస్‌ చేసింది. అయితే నాగార్జున మాత్రం టబు బెస్ట్ ఫ్రెండ్‌ అని చెబుతుంటాడు. హైదరాబాద్‌ కి ఆమె ఎప్పుడు వచ్చినా తన ఇంటికి వస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

25
చిరంజీవితో ఇండస్ట్రీ హిట్‌ మిస్‌ చేసుకున్న టబు

ఇదిలా ఉంటే టబు.. చిరంజీవితో ఒక ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకుంది. ఆ సినిమా చేసి ఉంటే టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగేది. ఓ రకంగా లేడీ సూపర్‌ స్టార్‌ గా రాణించేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఆ సినిమా ఏంటి? దానికి కారణమేంటి? అనేది చూస్తే. టబు తెలుగులో నటించిన తొలి చిత్రం `కూలీ నెం 1`. వెంకటేష్‌ సరసన ఈ చిత్రంలో నటించింది. అంతకు ముందు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ రాణించింది టబు. నాగార్జునతో `నిన్నే పెళ్లాడతా`తో ఇక్కడ బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. తెలుగులో హాట్‌ కేక్‌ అయిపోయింది.

35
రౌడీ అల్లుడులో ఛాన్స్ మిస్‌ చేసుకున్న టబు

కానీ బాలీవుడ్‌లో ఆమె అప్పటికే స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఫుల్‌ బిజీగా ఉంది. దీంతో తెలుగులో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా చేయలేకపోయింది. అయితే `కూలీ నెం 1` టైమ్‌లోనే టబుకి తెలుగులో మరో ఆఫర్‌ వచ్చింది. అది చిరంజీవితో. అప్పట్లో చిరంజీవి ఇక్కడ బిగ్గెస్ట్ స్టార్‌. ఆయనతో ఛాన్స్ అంటే మామూలు కాదు, కానీ టబుకి ఈ ఆఫర్‌ వచ్చినట్టే వచ్చి పోయింది. కె రాఘవేంద్రరావు.. చిరంజీవితో `రౌడీ అల్లుడు` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్రకి శోభన హీరోయిన్‌గా ఎంపికైంది. మరోపాత్రకి దివ్య భారతిని అనుకుంటున్నారు. దివ్య భారతి బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌. హాట్‌ కేక్‌ అని చెప్పాలి. అయితే ఆమె డేట్స్ సెట్‌ కావడం లేదు. దీంతో టబుని తీసుకోవాలనుకున్నారట.

45
టబు కొంప ముంచిన దివ్య భారతి

దివ్య భారతిపై టీమ్‌ అందరి ఫోకస్‌ ఉంది. ఆమె కోసం ఆగితే సినిమా డిలే అవుతుందని, దీంతో మెగాస్టార్‌ అభిమానులు గొడవ చేస్తారని భావించిన మేకర్స్ టబుని మరో హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట. కానీ ఇది సెట్‌ కాలేదు. దివ్యభారతి డేట్స్ ఓకే కావడంతో టబుని పక్కన పెట్టారట. అలా చిరంజీవితో మొదటిసారి కలిసి నటించే ఛాన్స్ ని టబు మిస్‌ చేసుకుంది. ఆ తర్వాత 2005లో `అందరివాడు`లో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇందులోనూ టబుది మెయిన్‌ రోల్‌ కాదు. సెకండ్‌ ఫీమేల్‌ లీడ్‌గా కనిపించింది. అలా `రౌడీ అల్లుడు`లో చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ ని టబు కోల్పోయింది. 1991లో వచ్చిన `రౌడీ అల్లుడు` మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం.

55
చిరంజీవితో టబు మరో ఛాన్స్ మిస్‌

ఒకవేళ టబు ఆ సమయంలో `రౌడీ అల్లుడు` మూవీ చేసి ఉంటే, ఆమె తెలుగులోనే సెటిల్‌ అయ్యేది, ఇక్కడ లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఆమె మరిన్ని సినిమాలు చేసేది. కానీ ఆ అవకాశం దివ్య భారతి వల్ల కోల్పోయిందని చెప్పొచ్చు. ఆమె కారణంగా టబు తెలుగులో కెరీర్‌ని మిస్‌ అయ్యింది. చిరంజీవి, టబు కాంబినేషన్‌లో మరో మూవీ కూడా ఆగిపోయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో `భూలోక వీరుడు` పేరుతో ఓ మూవీని ప్రారంభించారు. కానీ ఆ తర్వాత ఆపేశారు. 

టబు చివరగా తెలుగులో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించింది. మళ్లీ ఇప్పుడు కింగ్‌ 100లో నటిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించబోతుందట. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది టబు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories