
ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో చాలా మందికి వందల కోట్లల్లో ఆస్తులున్నాయి. సీనియర్లకి ఆస్తులు వేలల్లో ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, రవితేజ వేల కోట్లకు అధిపతులు. వీరితోపాటు అంతకు ముందు తరంలో చంద్రమోహన్, మురళీ మోహన్, శరత్ కుమార్ వంటి వాళ్లు కూడా వందల, వేల కోట్లు సంపాదించారు. అందుకు కారణం ఇద్దరే ఇద్దరు. వాళ్లే ఎన్టీఆర్, శోభన్ బాబు. వీరి కారణంగానే ఆ తర్వాత తరం హీరోలు, వారితోపాటు సినిమాలు చేసిన హీరోలు వందల కోట్లు సంపాదించుకున్నారట. ఆ కథేంటో చూస్తే.
శోభన్ బాబు తాను సంపాదించినది అంతా భూమిపై పెట్టుబడి పెట్టాడని, చెన్నైలో చాలా ఆస్తులు కొన్నాడని అంటారు. సగం చెన్నై శోభన్ బాబుదే అని వేల కోట్ల ఆస్తులకు ఆయన సొంతం అని సమాచారం. ఇప్పటి విలువ ప్రకారం సుమారుగా రూ.70-80వేల కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇక ఆయన చెప్పిన సలహాని చాలా మంది హీరోలు ఫాలో అయ్యారు. కొందరు ఫాలో కాలేదు. శోభన్‌బాబుతో చంద్రమోహన్‌కి మంచి స్నేహం ఉంది. చంద్రమోహన్ వద్ద డబ్బులు అప్పుగా తీసుకొని ల్యాండ్ కొన్నాడట సోగ్గాడు. చంద్రమోహనే చాలా సార్లు చెప్పారు. అలాగే తాను కూడా ఆయన సలహ మేరకు ఆస్తులు కొన్నానని, వాటి విలువ ఇప్పుడు వందల, వేల కోట్లు ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చంద్రమోహన్.
మురళీ మోహన్ కూడా శోభన్ బాబు సలహాతోనే ఆస్తులు కొన్నారు. బేసిక్‌గా మురళీ మోహన్ ది వ్యాపార కుటుంబం. బిజినెస్‌లు చేసేవారు. సినిమాల్లోకి వచ్చాక శోభన్ బాబుతో కలిసి చాలా సినిమాలు చేశారు మురళీ మోహన్. ఆయనకు పలు మార్లు భూములు కొని పెట్టుకో అని చెప్పారట. ఆయన సలహా మేరకే తాను రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగానని, జయభేరి ప్రాపర్టీస్ పేరుతో కంపెనీలు పెట్టారు. ఇప్పుడు వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆయన ఆస్తులు ఐదు వేల కోట్లకుపైగానే ఉంటాయని సమాచారం. ఒకప్పుడు మురళీ మోహన్ స్టార్ హీరోగా రాణించిన విషయం తెలిసిందే.
శోభన్‌బాబు చెప్పిన మాట కారణంగా వందల కోట్లు సంపాదించిన మరో నటుడు శరత్ బాబు. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో నటించారు. సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో ముఖ్యమైన నగరాల్లో శరత్ బాబు ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేశాడు. చెన్నైలో భారీ బంగ్లా, షాపింగ్ కాంప్లెక్స్, బెంగళూర్ లో ఇల్లు, కాంప్లెక్స్, హైదరాబాద్ లో ఇల్లు, ఆముదాల వలసలో ఇల్లు.. కొన్ని భూములు కూడా కొన్నాడట. మొత్తంగా ఆయన దాదాపు రూ.200 కోట్ల ఆస్తులను సంపాదించినట్లు అప్పటి జర్నలిస్ట్, డైరెక్టర్ కనగాల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అలాగే నాగార్జున కూడా వ్యాపారాల్లోకి దిగడానికి రియల్ ఎస్టేట్‌లోకి, ఇతర రంగాల్లోకి దిగడానికి శోభన్ బాబునే ఇన్‌స్పిరేషన్ అని జయకుమార్ చెప్పారు. నాగార్జునకి అనేక వ్యాపారాలున్నాయి. అందులో రియల్ ఎస్టేట్ కూడా ఉంది. ఆయన ఇప్పుడు టాలీవుడ్‌లోనే రిచ్చెస్ట్ హీరో అంటారు. ఆయన ఆస్తి ఐదు వేల కోట్లకుపైగానే ఉంటుందని సమాచారం. మొత్తంగా సోగ్గాడి స్ఫూర్తితోనే మన్మథుడు వేల కోట్లకు అధిపతి అయ్యాడని చెప్పొచ్చు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా భూములపై పెట్టుబడులు పెట్టారు. ఆయన కోకాపేటలో కొన్ని ఎకరాలు కొన్నాడట. దానికి కారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్ పీక్‌లో ఉన్నప్పుడు చిరంజీవి కొత్తగా హీరోగా ఎదుగుతున్నాడు. కలిసి ఓ సినిమాలో కూడా నటించారు. చిరంజీవిని చూసి అభినందించిన ఎన్టీఆర్.. బ్రదర్.. డబ్బుని జాగ్రత్త పర్చుకోవాలని, ఇనుప ముక్కల(కార్ల)పై ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ల్యాండ్‌పై ఇన్వెస్ట్ చేయండి, అదే మనల్ని కాపాడుతుందని చెప్పారట. ఆ మాటతోనే ఆ తర్వాత చిరంజీవి ల్యాండ్ కొన్నారట. ఇప్పుడు కోకాపేటలో ఒక్కో ఎకరం వంద నుంచి రెండు వందల కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన చిరంజీవికి మొత్తం ఆస్తులు(రామ్ చరణ్‌తో కలుపుకొని) మూడు నుంచి నాలుగు వేల కోట్లకు ఉంటుందని సమాచారం.
చిరంజీవితోపాటు రవితేజ కూడా పెద్దల స్ఫూర్తితోనే భూమిపై ఇన్వెస్ట్ చేశాడట. ఆయన ఆస్తులు కూడా వేల కోట్లు ఉంటుందని సమాచారం. కాకపోతే ఆయన ఎప్పుడూ బయటపడలేదు. మాస్ మహారాజా రవితేజ చూడ్డానికి సింపుల్‌గానే కనిపించినా, ఆయన ఆస్తుల పరంగా బిగ్ షాట్ అని సమాచారం. వందల ఎకరాల ల్యాండ్ కొని పెట్టుకున్నాడట. హైదరాబాద్ శివారు ప్రాంతంలో, ఏపీలో ఆయనకు భారీగా భూములు ఉన్నాయట. వాటి విలువ వేల కోట్లల్లో ఉంటుందని టాక్.