ఆడవాళ్లనే తప్పుబడతారా, మగాళ్లని ఎందుకు ప్రశ్నించరు, సమాజానికి నైతికత లేదు... సమంత షాకింగ్ పోస్ట్

Published : Oct 08, 2021, 01:38 PM ISTUpdated : Oct 08, 2021, 01:43 PM IST

మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లే అవుతుందని భావిస్తున్న సమంత, పరోక్షంగా తన వేదన వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు. Samantha వరుస సోషల్ మీడియా పోస్ట్స్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.  తాజాగా సమంత ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. 

PREV
15
ఆడవాళ్లనే తప్పుబడతారా, మగాళ్లని ఎందుకు ప్రశ్నించరు, సమాజానికి నైతికత లేదు... సమంత షాకింగ్ పోస్ట్


'ఏదైనా సంఘటన జరిగిన ప్రతిసారి ఆడవాళ్ళ విలువలు, నైతికతను ప్రశ్నించే సమాజం, మగాళ్లని ఎందుకు ప్రశ్నించదు. అంటే సమాజానికి కూడా నీతి లేనట్లే..' అంటూ ఓ కోట్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. నటి ఫరీదా డి... చెప్పిన ఈ కోట్ సమంత ఇక్కడ ప్రస్తావించారు. 

25


విడాకుల విషయంలో సమంతను మాత్రమే తప్పుబడుతున్నారని, నాగ చైతన్యను ఎవరు ప్రశ్నించడం లేదని సమంత బాధపడుతున్నారని, ఈ పోస్ట్ ద్వారా అర్థం అవుతుంది. ఒక వివాదం ఏర్పడితే ఆడవాళ్లలోనే లోపాలు, తప్పులు వెతికే ఈ సమాజానికి నీతి లేదని, సమంత ఘాటుగా బదులిచ్చారు. 

35


నిజానికి సామ్- Naga chaitanya విడాకుల ప్రకటన తరువాత మెజారిటీ వర్గాలు ఆమెనే కారణమంటూ కథనాలు వల్లించారు. సమంత వైపు నుండే తప్పులు వెతుకుతూ, వార్తలు గుప్పిస్తున్నారు. సదరు వార్తలతో విసిగిపోయిన సమంత, ఇలాంటి పోస్ట్ చేసినట్లు అర్థం అవుతుంది. 

45


మరోవైపు సమంత తన మకాం హైదరాబాద్ నుండి ఎత్తేస్తారని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే సమంత హైదరాబాద్ లోనే ఉంటానని గతంలో సోషల్ మీడియా చాట్ లో తెలియజేశారు. అలాగే సమంత నూతన చిత్రాల ప్రకటన కూడా చేయనున్నారట. ఏకంగా మూడు సినిమాలు ఆమె నుండి రానున్నాయి అంటున్నారు. 

55
Samantha

ఇక సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర దర్శకుడు గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా ఈ మైథలాజికల్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Also read Samantha Naga chaitanya divorce: తీవ్ర ఆవేదనలో సమంత... ఆమె విడాకులు కోరుకోలేదా!

Read more Photos on
click me!

Recommended Stories