Published : Aug 08, 2026, 04:34 PM ISTUpdated : Aug 10, 2026, 02:31 PM IST
Sobhita Dhulipala: నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శోభితకు తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
శోభిత ధూళిపాళ తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లో నటించింది. యువ కథానాయకుడు నాగ చైతన్యను వివాహం చేసుకుని దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటివరకు ఆమె నుంచి కొత్త తెలుగు సినిమా ప్రకటన రాలేదు. శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయే. ఆమె ఫ్యామిలీ వైజాగ్ కి చెందిన వారు. తెలుగమ్మాయి అయినప్పటికీ శోభిత బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆమెకి బాలీవుడ్ లో ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి.
25
టాలీవుడ్ లో నో ఆఫర్స్
పెళ్లి తర్వాత శోభిత తన కెరీర్‌ను ఇతర భాషలు, ఇతర రంగాల్లో కొనసాగిస్తున్నారు. ఫ్యాషన్‌కు సంబంధించిన కార్యక్రమాలు, హిందీ వెబ్ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో ఇతర సినీ పరిశ్రమల్లో కూడా తన పరిధిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న భవిష్యత్ నేపథ్య సైన్స్ ఫిక్షన్ చిత్రం వెట్టువంలో ఆమె భాగమయ్యారు. దీంతో తమిళం, హిందీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నప్పటికీ, తెలుగు సినిమాకు మాత్రం ఇప్పటివరకు ఆమె సైన్ చేయలేదు. గతంలో ఆమె తెలుగులో నటించిన గూఢచారి, మేజర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
35
నాగ చైతన్యతో మూవీ ?
ఓ ఇంటర్వ్యూలో శోభిత ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సరైన అవకాశం వస్తే తన భర్త నాగచైతన్యతో కలిసి తెరపై నటించడానికి ఎంతో సంతోషిస్తానని ఆమె తెలిపారు. అయితే ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనతో ఏ దర్శకుడు లేదా నిర్మాత తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ కోసం శోభిత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
శోభిత తనకు వచ్చే పాత్రలు, కథలు నచ్చితేనే ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. అంటే ప్రత్యేకంగా తెలుగు సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కాకుండా, పాత్రకు, కథకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
55
ఇతర భాషల్లో బిజీ
ప్రస్తుతం శోభిత చేతిలో తమిళ, హిందీ ప్రాజెక్టులు ఉండగా, తెలుగు సినిమాలో ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నాగచైతన్యతో కలిసి నటించే అవకాశం గురించి ఆమె సానుకూలంగా స్పందించడంతో, భవిష్యత్తులో ఈ కాంబినేషన్ తెరపై కనిపిస్తుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది.