రామ్ చరణ్ పై శంకర్ షాకింగ్ కామెంట్స్, పవర్ కంట్రోల్ చేస్తున్నాడు

First Published | Dec 19, 2024, 6:00 PM IST

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటన, శంకర్ దర్శకత్వం గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. RRR కి ముందే చరణ్ ని ఎంచుకున్నారని, ఆయన నటన అద్భుతంగా ఉందని శంకర్ ప్రశంసించారు. ఎంపీ ఎస్ వెంకటేషన్ రచయితగా కీలక పాత్ర పోషించారని కూడా తెలిసింది.

Game Changer


టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జనవరి 10న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం, ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. పొలిటికల్  డ్రామాగా ఇప్పటికే ఎక్సపెక్టేషన్స్ పెంచింది. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా, తన ట్రైలర్, పాటలతో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపధ్యంలో శంకర్ ...రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.


రామ్ చరణ్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవటం గురించి మాట్లాడుతూ.... RRR విడుదలకు ముందే ఈ చిత్రంలో నటించాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ ఉంటే బాగుంటుందని దిల్ రాజు భావించారు. నాకు కూడా అదే కరెక్ట్ గా అనిపించింది. నా కథలు సాధారణంగా యూనివర్సల్ థీమ్స్ గా ఉంటాయి. ఏ హీరోకైనా పర్ఫెక్ట్‌గా సరిపోతారు కాబట్టి ఈ చిత్రంలో చరణ్ తో ప్రయాణం జరిగింది’’ అని శంకర్ అన్నారు.


ఇక రామ్ చరణ్ నటన గురించి శంకర్ మాట్లాడుతూ.. ‘‘అతన్ని చూస్తుంటే లోపల ఉన్న పవర్‌ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది.. అవసరం వచ్చినప్పుడు పేలుతుందని కూడా అనిపిస్తుంది.. డీప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల ఆర్టిస్ట్. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఆయన ఎలాంటి సీన్ అయినా అందంగా హ్యాండిల్ చేశాడు అని మెచ్చుకున్నారు


 మరో ప్రక్క ఈ చిత్రానికి తమిళనాడు మధురై నియోజకవర్గ ఎంపీ ఎస్ వెంకటేషన్ రచయితగా పనిచేసినట్లు సమాచారం. రాజకీయ నాయకుడిగానే కాకుండా, ప్రముఖ రచయితగా పేరున్న వెంకటేషన్, తన నవల వీర యుగ నాయకన్ ద్వారా శంకర్ దృష్టిని ఆకర్షించారు. ఆ నవల హక్కులను శంకర్ కొనుగోలు చేసిన అనంతరం, ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ విషయంలో ఆయన పాత్ర కీలకంగా మారింది.

Game Changer


చరణ్ ఐఏఎస్ పాత్రకు వెంకటేషన్ ప్రత్యేకంగా సహకరించారని, పాత్రను డెప్త్ గా డిజైన్ చేయడంలో తన విశేషాలను అందించారని తెలిసింది. సినిమాకు అవసరమైన రాజకీయ నేపథ్యాన్ని, సంభాషణల నైపుణ్యాన్ని ఆయన అందించారని సమాచారం. సెట్స్‌కు తరచూ హాజరైన వెంకటేషన్, తన సూచనల ద్వారా శంకర్ విజన్‌కు విలువైన మద్దతుగా నిలిచారు. మూడేళ్ల కృషితో రూపొందిన గేమ్ ఛేంజర్, రాజకీయ నేపథ్యంలో చరణ్ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చేలా ఉందని టాక్. ఎస్ వెంకటేష్ రైటింగ్ టచ్ ఈ సినిమాలో ఎలా ప్రభావితం చేస్తుందనేది సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది.

Latest Videos

click me!