టాయిలెట్ లో చేతులు పెట్టి చెక్  చేస్తాడు,మోహన్ బాబుని ఉద్దేశిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్ 

First Published | Dec 19, 2024, 2:44 PM IST

మంచు మోహన్ బాబును ఉద్దేశిస్తూ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మోహన్ బాబు ఎలాంటి వారో ఆయన తెలియజేశారు. 
 

Mohan Babu, Manoj and Vishnu

మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు ఇటీవల పతాక శీర్షికలకు ఎక్కాయి. మోహన్ బాబుపై చిన్న కొడుకు మనోజ్ యుద్ధం ప్రకటించాడు. మోహన్ బాబు, మనోజ్ భౌతిక దాడులకు తెగబడ్డారు. మనోజ్ గన్ మెన్ ని వెంట తెచ్చుకున్నాడని సమాచారం. ఇక మోహన్ బాబు తన వద్ద ఉన్న రెండు లైసెన్స్డ్ రివాల్వర్స్ తో హల్ చేశాడు. పోలీసులు వాటిని అనంతరం స్వాధీనం చేసుకున్నారు. 


ఈ గొడవలకు ఆస్తి పంపకాలే కారణమని కథనాలు వెలువడ్డాయి. మనోజ్ మాత్రం ఆత్మగౌరవం కోసం నా పోరాటం అన్నారు. నా కుటుంబ భద్రత కొరకు నా ఆవేదన అంటూ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నాడు. అలాగే తిరుపతిలో గల శ్రీ విద్యానికేతన్ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు మోసపోతున్నారు. వాళ్లకు నేను అండగా ఉంటాను, అని స్టేట్మెంట్ ఇచ్చారు. 


శ్రీవిద్యా నికేతన్ లో నిజంగా అక్రమాలు జరుగుతున్నాయా? అనే సందేహాలు మొదలయ్యాయి. మనోజ్ ఆరోపణలను మోహన్ బాబు ఖండించారు. ఒక విద్యార్ధి తల్లిదండ్రులు అయినా ఫిర్యాదు చేశారా? వీలైనంత తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మోహన్ బాబు అన్నారు. కాగా గతంలో బెల్లంకొండ శ్రీనివాస్.. శ్రీవిద్యా నికేతన్ గురించి మాట్లాడారు. అక్కడ పరిస్థితులు వెల్లడించారు. 


మోహన్ బాబు మా గురువుగారు. తిరుపతిలో స్కూల్ పెట్టాడు. అది కాలేజీ అయ్యింది. ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. ఆ స్కూల్ లో భోజనం కానీ, టిఫిన్ కానీ చేస్తే.. జీవితంలో మరచిపోలేము. అంత బాగుంటుంది. వేల మంది విద్యార్థులకు వాళ్లకు ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తారు. ఇదే తినమని వాళ్ళకు ఆయన చెప్పడు. మీకు నచ్చింది తినమంటాడు. 
 

ఇడ్లీ, దోశ, బ్రెడ్, ఆమ్లెట్, ఉప్మా..  ఇలా పలు రకాల టిఫిన్స్ ఉంటాయి. మోహన్ బాబు బాత్ రూమ్స్ కి వెళతారు. టాయిలెట్స్ ని తాకి పరిశీలిస్తారు. వాష్ బేసిన్స్ సైతం నీట్ గా ఉన్నాయా లేదా? అని చెక్ చేస్తారు. అందుకే శ్రీవిద్యా నికేతన్ ఆ స్థాయికి వెళ్ళింది, అన్నారు. మోహన్ బాబు నాణ్యమైన విద్యతో పాటు ఆహారం, శుభ్రతతో కూడిన పరిసరాలు విద్యార్థులకు అందిస్తున్నారని అర్థం అవుతుంది. 

కాగా మనోజ్ మాత్రం ఇందుకు భిన్నమైన ఆరోపణలు చేశాడు. ఇటీవల మనోజ్ తల్లి నిర్మలాదేవి సైతం మనోజ్ ఆరోపణలను ఖండించింది. తన ఇంటి జనరేటర్ లో విష్ణు పంచదార పోశాడని విష్ణు ఆరోపించాడు. విష్ణు అలా చేయలేదు. నా బర్త్ డే కావడంతో కేక్ కట్ చేయించి. తమ గదిలో ఉన్న సామాను తీసుకుని వెళ్లిపోయాడని.. నిర్మలా దేవి ఫహాడీ షరీఫ్ పోలీసులకు లిఖిత పూర్వకంగా తెలియజేసింది. 

Latest Videos

click me!