రజినీకాంత్ - చిరంజీవి మధ్య పెద్ద గొడవ, అరుచుకున్న స్టార్ హీరోలు, అసలు విషయం చెప్పిన మెగాబ్రదర్..

First Published | Dec 19, 2024, 3:41 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య పెద్ద గొడవ చెలరేగిందంట. ఇంతకీ ఆ గొడవ ఎందుకు వచ్చింది. దానికి కారణం ఏంటి..? ఈ విషయాలను ఓ సందర్భంలో వెల్లడించారు మెగా బ్రదర్ నాగబాబు. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

టాలీవుడ్ ఒక్కటే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా.. ఆర్టిస్ట్ లు ఎవరైనా.. అందరు స్నేహంగానే ఉంటారు. కాని కొంత మంది మధ్య మాత్రమే గొడవలు, కొట్లాటలే కొనసాగుతుంటాయి. అయితే అందులో కొన్ని క్లియర్ అయ్యి మంచిగానే ఉంటారు. మరికొందరు మాత్రం జీవితకాల శత్రుత్వాన్ని మెయింటేన్ చేస్తుంటారు. అయితే షూటింగ్స్ టైమ్ లో స్టార్స్ మధ్య కూడా మాట మాట పెరగడం, చిన్న చిన్న వివాదాలు కామన్ గా జరుగుతుంటాయి. 
 

అయితే అవి స్టార్స్ మధ్య కూడా కామన్ గా ఉండేవే. ఈక్రమంలోలే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య కూడా ఇలాంటి గొడవ ఒకటి జరిగిందటన ఇంతకీ ఆ కొడవకు కారణం ఏంటో తెలియదు కాని.. అసలు విషయాన్ని మాత్రం చిరంజీవి తమ్ముడు.. మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోలో వెళ్ళడించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కు కోపం ఎక్కువగా ఉండేదట. 
 


ఆయన సెట్ లో కూడా అందరిమీద కోపగించుకునేవారట. మీడియా పట్ల కూడా దురుసుగా ఉండేవారట. అయితే రజినీకాంత్ ఎప్పుడైతే మహావతార్ బాబా కి భక్తుడిగా మారాడో అప్పటి నుండి పూర్తిగా మారిపోయాడట. అప్పటి నుంచి రజినీకాంత్ చాలా ప్రశాంతంగా ఉంటారు, ఎవరిపట్ల కోపంగా ఉండటం, విమర్శించడం లాంటివి చేయరు అంటూ వెల్లడించారు నాగబాబు. అయితే చిరంజీవి, రజినీకాంత్ కలిసి తెలుగులో కాళీ అనే సినిమా చేశారు. 
 

ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ఇద్దరిమధ్య చిన్న ఇష్యూ వచ్చిందట. అంతే కాదు అది పెద్ద గొడవగా మారి.. షూటింగ్ స్పాట్ లోనే అరుచుకున్నాట. డైరెక్టర్ వచ్చి బ్రతిమలాడి ఆ గొడవను ఆపేశారట. ఆతరువాత రజినీకాంత్ మారిపోయిన తరువాత ఇద్దరు మంచి స్నేహితుల్లా ఉన్నారు ఇప్పటి వరకీ కూడా.  ఈ విషయాన్ని సోషల్ మీడియాలో  చెప్పుకొచ్చాడు నాగబాబు. 
 

రీసెంట్ గా నాగబాబు  జైలర్ సినిమాలో నటించారు. అయితే ఈ  సినిమా షూటింగ్ అయిపోయే టైమ్ కు  రజినీకాంత్ తో కలిసి  ఒక ఫోటో దిగాలని అనిపించిందట.. ఆ విషయం  PA ద్వారా తెలుసుకున్న సూపర్ స్టార్..  స్వయంగా నాగబాబు వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకున్నాడట. 

ఆ అద్భుతమైన.. మధురమైన జ్ఞాపకాన్ని  ఎప్పటికీ మర్చిపోలేను అంటూ నాగబాబు. ఇక రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈసినిమా రిలీజ్ కాబోతోంది. 

Latest Videos

click me!