సావిత్రి సినిమాకు నేను పాట పాడను అని స్టార్ సింగర్ జానకి ఎందుకు అన్నారో తెలుసా? సావిత్రి - జానకి మధ్య గొడవలేంటి. సావిత్రి విషయంలో జానకి ఎందుకు హర్ట్ అయ్యిందతో తెలుసా?
మహానటి సావిత్రి అంటే ఇష్టపడని తెలుగువారు ఉండరు. ఆమె నటనకు ఈతరం ప్రేక్షకులు కూడా ఫిదా అవుతుంటారు. మహానటి సినిమాతో ఇప్పటి జనరేషన్ కు కూడా సావిత్రిమీద గౌవరం పెరిగిపోయింది. ఆమె అందం, అభినయం, అన్నింటికి మించి సావిత్రి మంచి మనసు ప్రతీ ఒక్కరికి ఆమెపై గౌరవాన్ని పెంచింది.
26
చివరి రోజుల్లో సావిత్రి
చివరి రోజుల్లో సావిత్రి అనుభవించిన కష్టాలు, ఇబ్బందులు, ఆమె మరణం గురించి తెలుసుకుని కన్నీరు పెట్టనివారంటూ ఉండరు. ఆ కాలంలో కూడా మహానటి సావిత్రి అంటే ప్రతీ ఒక్కరు ఇష్టపడేవారు. అయితే స్టార్ సింగర్ జానకి మాత్రం సావిత్రికి నేను పాటలు పాడననిచెప్పేశారట. చివరి వరకూ అదే మాట మీద ఉన్నారట.
36
మూడు తరాలకు పాటలు పాడిన జానకి..
ఆతరం స్టార్ సింగర్స్ లో ఎస్ జానకి ఒకరు. ఆమె అంజలి, సావిత్రి, కాలం నుంచి ఈ కాలం హీరోయిన్లు వరకూ మూడు తరాల తారలకు పాటలు పాడారు. జానకితో పాటు సుశీల కూడా మూడు తరాల హీరోయిన్లకు పాటలు పాడి అలరించారు. తెలుగు, తమిల, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వేల పాటలు పాడారు జానకి.
జానకి ఏ భాషలో పాడినా.. ఆ భాషవారు జానకి తమవారే అనేంతగా మంచి ఇమేజ్ ను సాధించారు. ఎంతో మంది స్టార్ సింగర్స్ జానకిని సంగీత దేవతలా కొలుస్తుంటారు. దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు జానకమ్మ. అయితే హీరోయిన్ల విషయానికి వస్తే.. జానకి అందరు హీరోయిన్లకు పాటలు పాడుతాను కానీ.. సావిత్రికి పాడను అని చెపేశారట. అందుకు కారణం ఏంటో తెలుసా?
56
సావిత్రి పాటలు పాడను తెగేసి చెప్పిన జానకి..
జానకి పలు ఇంటర్వ్యూలలో సావిత్రి విషయంపై క్లారిటీ ఇచ్చారు. సావిత్రికి కెరీర్ బిగినింగ్ నుంచి ఎక్కువగా పాటలు పాడింది పి లీల. మాయా బజార్, మిస్సమ్మ లాంటి సినిమాల్లో లీల.. సూపర్ హిట్ పాటలు పాడారు. ఆమె తరువాత సావిత్రి సుశీలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారట. తన పాటను సుశీల మాత్రమే పాడాలి అని రూల్ పెట్టేవారట.
ఓ తమిళ సినిమాలో సావిత్రి పాటను జానకి ఆలపించగా.. అద్భుతంగా వచ్చని ఆ పాటను కాదని.. మళ్లీ సుశీలమ్మతో రీ టేక్ పాడించారట. దాంతో అప్పటి నుంచి జానకి సావిత్రి పాటలను పాడకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జానకి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
66
జానకి మాట్లాడుతూ..
''సావిత్రికి సుశీల గాత్రం అంటే ఇష్టం. ఆమె అభినయానికి సుశీల అయితేనే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం కాబోలు. అందుకే నేను పాడతా అంటే ఆమె ఒప్పుకునేవారు కాదు. నీలీల పాడేద దేవ పాటను కూడా నేను పాడను అనిచెప్పేశాను. సావిత్రి అభినయించడంతో.. ఈ పాటను పాడటానికి 3 నెలలు పెండింగ్ లో పెట్టాను. చివరకు ఆ పాటలో సావిత్రి నటించడంలేదు అని నిర్మాతలు దర్శకులు చెప్పడంతో పాడటానికి ఒప్పుకున్నాను. కానీ చివరకు ఆ పాటలో సావిత్రి నటించింది''. అని జానకి అన్నారు.