Roja Selvamani: 90స్ లో టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్లలో రోజా కూడా ఒకరు. ఒక దశలో ఇండస్ట్రీని వదిలేసి పారిపోదామనుకున్న ఈ హీరోయిన్ కు మెగాస్టార్ చిరంజీవి చేసిన ఉపదేశం ఏంటో తెలుసా? Why Roja Wanted to Leave Movies and What Megastar Chiranjeevi Advised Her
రోజా సెల్వమణి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా గుర్తింపు సాధించింది. 90స్ లో వెండితెరపై వెలుగు వెలిగిన హీరోయిన్లలో రోజా ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, శ్రీకాంత్ సరసన ఎన్నో సినిమాల్లో మెప్పించిన ఈ హీరోయిన్.. తమిళంలో రజినీకాంత్, కార్తీక్, ప్రశాంత్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ తో నటించింది కన్నడలో కూడా ఆమె చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత చాలా తక్కువ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన రోజా.. రాజకీయాల్లో బిజీ అయిపోయింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
24
సినిమాలు వదిలి వెళ్లిపోవాలని ఎందుకు అనుకున్నారు..
ఇక కెరీర్ బిగినింగ్ లో రోజా సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నారని తెలుసా? అప్పుడు చిరంజీవి చెప్పిన మాటలు, అప్పట్లో షూటింగ్స్ కు సంబంధించిన కొన్ని విశేషాలు, అలాగే తనకు నటనపై ఆసక్తి లేక ఎందుకు సినిమాలు వదిలేయాలనుకున్నారో ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రోజా వెల్లడించారు. రోజా తన కెరీర్ ప్రారంభంలో నటన, డాన్స్ సరిగ్గా రాక కొద్దిగా ఇబ్బంది పడేవారు. రోజువారీ షూటింగ్‌లతో బాగా అలసిపోవడం వల్ల "నాకు నటన వద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు" అని అంటూ ఉండేటివారట. నిరంతరం ఉండే బిజీ షెడ్యూల్స్ వల్ల ఆమెకు సినీ పరిశ్రమ వదిలి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చేది.
34
రోజాతో మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే?
'ముఠామేస్త్రి' సినిమా షూటింగ్ సమయంలో రోజా ఇలా వెళ్ళిపోతాను అనడం చూసి మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ధైర్యం చెప్పారు. "నువ్వెప్పుడూ నటన వద్దు అంటూ ఉంటావు కానీ, దేవుడు నీకు నటనను చాలా బలంగా రాశాడు, చూడు ఎంత బాగా చేస్తున్నావో" అని ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ ప్రోత్సహించేవారు. ఆతరువాత కాలంలో ఆమె అనుకున్నట్టుగానే స్టార్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది. 'ముఠామేస్త్రి' లో ఓ పాటాలో మెగాస్టార్ తో పోటీపడి డాన్స్ చేసింది రోజా. ఊటీలో జరిగిన 'మామా మామా.. రొయ్య పట్టు చారు' పాట షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం ఉండేది. ఆ పాటలోని డ్యాన్స్ మూమెంట్లు, ఎక్స్‌ప్రెషన్లలో రోజా .. చిరంజీవికి ఏమాత్రం తగ్గకుండా పోటీపడి నటించింది. వారిద్దరి కేమిస్ట్రీ, ఫ్రేమ్స్ షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చాయని చిరంజీవి అప్పట్లో కాంప్లిమెంట్ ఇచ్చారు.
చిరంజీవి సతీమణి సురేఖ కూడా రోజా డాన్స్ - యాక్టింగ్‌ను చాలాసార్లు ప్రశంసించేవారు. "చిరంజీవితో ఈక్వల్‌గా చాలా బాగా చేస్తావు, నీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం" అని సురేఖ రోజాకి ఎంతో సపోర్ట్‌గా మాట్లాడేవారు. ఆ రోజుల్లో రోజా పగలు రాత్రీ కష్టపడ్డ రోజులు ఉన్నాయి. 'ముఠామేస్త్రి' షూటింగ్ టైమ్ లో కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు ఈ షూటింగ్ చేసి.. మళ్ళీ.. రాత్రి వేళల్లో వేరే సినిమాల షూటింగ్‌లో పాల్గొనేవారు. అలాగే నాగార్జునపై ఉన్న అభిమానంతో 'రక్షణ' సినిమాలో 'గల్లుమంది బాసు' అనే పాటలో నైట్ షూట్ చేసి నటించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రోజా ఈ విషయాలను వెల్లడించారు.