మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్

Published : Sep 21, 2026, 07:31 AM IST

Chiranjeevi: హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో చిరంజీవి, ఏషియన్ సినిమాస్ కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

PREV
15
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ సినిమా ప్రాజెక్ట్

హైదరాబాద్‌లో మరో భారీ సినిమా ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ కలిసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రీమియం సినిమా ప్రాపర్టీని తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.గతంలో మహేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సినిమా స్క్రీన్స్ నిర్మించారు. ఇప్పుడు వాళ్ళని మించేలా చిరంజీవి ప్లాన్ ఉండబోతోంది.

25
జర్మనీ స్క్రీన్‌ను మించేలా ప్లాన్

ప్రస్తుతం ప్రపంచంలో పనిచేస్తున్న అతిపెద్ద సినిమా స్క్రీన్‌గా జర్మనీలోని ట్రామ్‌పాలస్ట్ లియోన్‌బర్గ్ స్క్రీన్‌కు గిన్నిస్ రికార్డు ఉంది. ఈ స్క్రీన్ వెడల్పు సుమారు 127 అడుగులు, ఎత్తు 69 అడుగులు కాగా, మొత్తం విస్తీర్ణం దాదాపు 8,770 చదరపు అడుగులు. ఇందులో 574 రిక్లైనర్ సీట్లు ఉన్నాయి. డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్‌తో కూడిన ఈ థియేటర్‌ను మించే స్థాయిలో హైదరాబాద్‌లో కొత్త స్క్రీన్‌ను రూపొందించే ప్రయత్నం జరుగుతోంది.

35
అమెరికాలో మరో భారీ స్క్రీన్

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న రాయల్ సినిమాస్ 14 ఐమ్యాక్స్ కూడా భారీ స్క్రీన్‌కు పేరుగాంచింది. ఈ స్క్రీన్ సుమారు 101 అడుగుల వెడల్పు, 76.2 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీని విస్తీర్ణం దాదాపు 7,696 చదరపు అడుగులు. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం సినిమా అనుభవం కోసం ఇలాంటి భారీ స్క్రీన్లపై దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రాజెక్ట్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకత సాధించేలా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.

45
హైదరాబాద్‌లో ఇప్పటికే మొదలైన భారీ స్క్రీన్ల పోటీ

హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ తెరలతో కూడిన ప్రీమియం సినిమా అనుభవానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోకాపేట్‌లోని అల్లు సినిమాస్‌లో సుమారు 75 అడుగుల వెడల్పు ఉన్న స్క్రీన్‌ను భారత్‌లో అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి–ఏషియన్ సినిమాస్ ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేయబోయే తెర పరిమాణం, సాంకేతిక సామర్థ్యం వంటి అంశాలపై ఆసక్తి మరింత పెరిగింది.

55
పూర్తి వివరాలు ఎప్పుడొస్తాయో?

ప్రస్తుతం చిరంజీవి, ఏషియన్ సినిమాస్ ప్రాజెక్ట్‌లో ప్రతిపాదిస్తున్న స్క్రీన్‌కు సంబంధించిన కచ్చితమైన కొలతలు, సీటింగ్ సామర్థ్యం, ప్రొజెక్షన్ టెక్నాలజీ వంటి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. అయితే ప్రస్తుత ప్రపంచ రికార్డులను అధిగమించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు సునీల్ నారంగ్ చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్‌లోని సినిమా ప్రదర్శన రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories