Venkatesh: సౌందర్య కోసం రోజాకు అన్యాయం చేసిన వెంకటేష్? రాజా సినిమా ఎలా మిస్సయిందంటే?

Published : Oct 01, 2026, 08:00 AM IST

Venkatesh: సౌందర్య కోసం రోజాకు వెంకటేష్ అన్యాయం చేశాడా? రోజా నటించాల్సిన సినిమాలో సౌందర్యను తీసుకున్నాడా? రాజా సినిమాలో ఛాన్స్ ను రోజా ఎందుకు కోల్పోవలసి వచ్చింది. వెంకీకి రోజాకు మధ్య మనస్పర్ధలు ఎందుకొచ్చాయి?

PREV
15
వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమా..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమా కథ ఒకరి నుంచి మరొకరి వద్దకు వెళ్లడం, కొన్ని కాంబినేషన్లు ఊహించని విధంగా మారి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం సర్వసాధారణం. అలాంటి సినిమాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ 'రాజా' (1999) ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్య నటించి తన అద్భుతమైన నటనతో నంది అవార్డును గెలుచుకున్నారు. అయితే ఈ పాత్రకు సౌందర్య మొదటి ఎంపిక కాదు. అసలు ఈ సినిమాలో రోజా నటించాల్సి ఉందట. కానీ సడెన్ గా సౌందర్య ఎందుకు వచ్చింది.

25
స్టేట్ అవార్డ్ సాధించిన రోజా..

రాజా సినిమా తమిళ సినిమాకు రీమేక్.. 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చి సంచలన విజయం సాధించిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే సినిమాకు అధికారిక రీమేక్ రాజా సినిమా. ఈ తమిళ వెర్షన్‌లో రోజా హీరోయిన్ గా నటించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును కూడా కైవసం చేసుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు, అదే పాత్రను తెలుగులోనూ తనే చేయాలని రోజా ఎంతగానో ఆశించింది. డైరెక్టర్, నిర్మాత కూడా రోజానే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నట్టు తెలుస్తోంది.

35
రోజాకు బదులు సౌందర్యను తీసుకున్న వెంకటేష్..

రాజా మూవీ కోసం తమిళంలో చేసిన రోజానే హీరోయిన్ గా తీసుకోవాలని దర్శక నిర్మాతలు కూడా అనుకున్నారట. కానీ కొన్ని పరిణామాల వల్ల రోజా ఈసినిమా మిస్ అయ్యింది. దానికి కారణం వెంకటేష్ తో రోజాకు పోకిరీ రాజా సినిమా టైమ్ లో వచ్చిన విభేదాలు కారణం అని తెలుస్తోంది. అంతే కాదు పోకిరి రాజ ప్లాప్ అవ్వడంతో రోజా, వెంకటేష్ కాంబినేషన్ లో సినిమాలు రాలేదు. , కొంత మంది మధ్య వర్తుల వల్ల వెంకటేష్ తనకు గ్యాప్ వచ్చిందని రోజా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాదు ఓ సినిమా విషయంలో రోజా భర్త సెల్వకు వెంకటేష్ కు గ్యాప్ రావడం కూడా ఇందుకు కారణం అని తెలుస్తోంది. అంతే కాదు ఆసినిమా సమయంలో రోజా వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. 'రాజా' చిత్రానికి అవసరమైన డేట్లను కేటాయించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని టాక్.

45
వెంకటేష్ - సౌందర్య సూపర్ హిట్ కాంబినేషన్

అన్నింటికి మించి వెంకటేష్ - సౌందర్య సూపర్ హిట్ కాంబినేషన్ కూడ కారణం అయ్యింది. అప్పటికే వెంకటేష్, సౌందర్య జంటగా వచ్చిన 'పవిత్ర బంధం', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' వంటి చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. వీరిద్దరి మధ్య ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీకి తెలుగు ప్రేక్షక లోకంలో మంచి క్రేజ్ ఉండేది. అంతే కాదు 'రాజా'లోని ‘అంజలి’ పాత్ర అమాయకత్వం, సానుభూతి, సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఆ సమయంలో సౌందర్యకున్న హోమ్‌లీ ఇమేజ్, ఆమె నటనలోని సహజత్వం ఈ పాత్రకు మరింత పర్ఫెక్ట్‌గా సరిపోతాయని ఆమెనే తీసుకున్నారట టీమ్.

55
సౌందర్య నటకు 100 మార్కులు పడ్డాయి..

దర్శకుడు ముప్పలనేని శివ, నిర్మాత ఆర్.బి. చౌదరి కూడా సౌందర్యను ఫైనల్ చేశారు. వెంకటేష్ - సౌందర్యల కాంబినేషన్, ఎస్.ఎ. రాజ్‌కుమార్ అందించిన స్వరాలు రాజా సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.. ఈ సినిమా విజయంలో మ్యూజిక్ ప్రముఖ పాత్ర పోషించింది. సౌందర్య తన ఎమోషనల్ యాక్టింగ్ తో అంజలి పాత్రకు ప్రాణం పోశారు. ఒకవేళ రోజా ఈ సినిమా చేసి ఉంటే పరిణామాలు ఎలా ఉండేవో కానీ, సౌందర్య ఎంపిక మాత్రం 'రాజా' సినిమాను తెలుగు సినీ చరిత్రలోనే ఒక క్లాసిక్‌గా నిలబెట్టింది.

Read more Photos on
click me!

Recommended Stories