బిగ్ బాస్ తెలుగు 10లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ సాగుతోంది అంటూ ముకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు చిన్నదోవైపు, పెద్దదోవైపు అని కూడా అన్నారు. ముకేశ్ ఎవరిని ఉద్దేశించి అన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో బుధవారం రోజు హౌస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా త్రిగుణ్, అమన్ మధ్య ఫిజికల్ గా జరిగిన గొడవలే హైలైట్ అయ్యాయి. గేమ్ ఉన్నా లేకున్నా వాళ్లిద్దరూ ఫిజికల్ కావడానికి ప్రయత్నించారు. కొన్ని సందర్భాల్లో ఫిజికల్ అయ్యారు కూడా. దీనితో ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది.
24
అసభ్యకరమైన పదంతో తిట్టాడు
డ్రాగర్ లని ఒకరి నుంచి ఒకరు దొంగిలించుకునే క్రమంలో ఝాన్సీ, సృష్టి, షాలిని గొడవ పడ్డారు. వారి గొడవలోకి త్రిగుణ్, అమన్ కూడా వెళ్లారు. దీనితో వీళ్ళిద్దరూ ఒకరినొకరు దాడి చేసుకుంటూ పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో తనని త్రిగుణ్ అసభ్యంగా తిడుతూ 'ఎల్' అనే పదం తిట్టాడని అమన్ అన్నారు. అమన్ కోపం కట్టలు తెంచుకుంది. అమన్ కూడా త్రిగుణ్ పై దాడికి ప్రయత్నించారు.
34
త్రిగుణ్, అమన్ మధ్య యుద్ధం
ఆ తర్వాత బిగ్ బాస్ టీమ్ భైరవకి .. టీమ్ సప్త శక్తికి టాస్క్ ఇచ్చారు. ఇది పంచభూతాలలో కూడిన టాస్క్. అందులో ముందుగా అగ్నితో ప్రారంభించారు. ఒక్కో టీం నుంచి నలుగురు సభ్యులు ఈ టాస్క్ లో పాల్గొన్నారు. టీం భైరవ నుంచి వంశీ, రామ్ ప్రసాద్, అమన్, రోహిత్ పాల్గొన్నారు. టీమ్ సప్త శక్తి నుంచి త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, సృష్టి పాల్గొన్నారు. ఈ టాస్క్ లో కూడా త్రిగుణ్, అమన్ ఫిజికల్ గా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్ తో టీమ్ భైరవ విజయం సాధించింది.
ఆ తర్వాత షాలిని కారణంగా మరో గొడవ చెలరేగింది. షాలిని కెప్టెన్ రూమ్ లోకి వెళ్లి డ్రాగర్ లని దొంగిలించడానికి ప్రయత్నించింది. వర్షిణి అది గమనించింది. మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. ఈ గొడవలో రోహిత్, షాలిని, చరణ్ ఒకవైపు.. వంశీ, సుధీర్ మరోవైపు ఉన్నారు. పక్కనే ఉన్న ముఖేష్ .. రోహిత్, షాలిని, అపూర్వ లని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నదోవైపు, పెద్దదోవైపు.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ సాగుతోంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీనితో రోహిత్, అపూర్వ, షాలిని సీరియస్ అయ్యారు. పర్సనల్ కామెంట్స్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. నన్ను పర్సనల్ గా కామెంట్స్ చేస్తే నేను కూడా చేస్తా అని ముకేశ్ అన్నారు.