పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలపై ఓ నిర్మాత సెటైర్లు వేశారు. పుష్పతో పోల్చుతూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ లాగా బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల సరిగ్గా ఉడికించలేకపోయారు అని అన్నారు.
తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువైన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఈ ట్రెండ్ పెరిగింది. వందల కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలన్నీ విజయం సాధించడంలేదు. సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలపై సెటైర్లు వేశారు.
25
పెద్ది, ది ప్యారడైజ్ పై కామెంట్స్
ఆ సినిమాలు భారీ హైప్ తో రిలీజ్ అయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి అని అన్నారు. ఈ సినిమాలని పుష్పతో పోల్చుతూ ఆయన వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి. పెద్ది, ప్యారడైజ్ సినిమాలకు నెగిటివ్ టాక్ ఎందుకు వచ్చిందో తమ్మారెడ్డి వివరించారు. పుష్ప 2 హిట్ అయిన రేంజ్ లో ఈ రెండు సినిమాలు ఎందుకు హిట్ కాలేదో కూడా చెప్పారు.
35
పుష్పలో ఇంటి పేరు కోసం..
తమ్మారెడ్డి మాట్లాడుతూ.. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు, ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ సుకుమార్ శిష్యులే. పుష్ప మూవీలో స్మగ్లింగ్ అంశం ఉంటూనే అంతర్లీనంగా హీరో ఇంటిపేరు గుర్తింపు అంశం ఉంటుంది. దానిని సుకుమార్ అద్భుతంగా వర్కౌట్ చేశారు. పెద్ది సినిమాలో ఇంకాస్త ఎక్కువగా ఒక ఊరి గుర్తింపు కోసం పోరాడే హీరో కథని డైరెక్టర్ తీసుకున్నారు. ది ప్యారడైజ్ మూవీలో ఒక జాతి గుర్తింపు కోసం పోరాడే హీరో కథని తీసుకున్నారు.
కానీ ఆ రెండు సినిమాలని చూస్తుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనిపించింది. సుకుమార్ స్థాయిలో బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల సక్సెస్ కాలేదు. పెద్ది సినిమా ఏమో 75 శాతం మాత్రమే ఉడికింది. ప్యారడైజ్ మూవీ 10 శాతం మాత్రమే ఉడికింది అంటూ తమ్మారెడ్డి సెటైర్లు వేశారు. గుర్తింపు కోసం పోరాడే కథలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ వందల కోట్ల బడ్జెట్ పెట్టడం, అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడం ఎందుకు అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.
55
బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల కష్టపడ్డారు కానీ
అవే కథలని తక్కువ బడ్జెట్ లో కూడా తెరకెక్కించవచ్చు. సినిమాకి భారీతనం తీసుకురావడం కోసం ఏవేవో చేశారు. అందువల్లే ఆ సినిమాలకు ఆశించిన రిజల్ట్స్ రాలేదు. సుకుమార్ కంటే బుచ్చుబాబు పెద్ది కోసం కష్టపడ్డారు అందులో అనుమానం లేదు. అంతకంటే ఎక్కువ కష్టం శ్రీకాంత్ ఓదెల పడ్డారు. కానీ కష్టం తో సినిమాలు ఆడవు అని తమ్మారెడ్డి తేల్చేశారు. అయితే పెద్ది మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగా రాణించింది. హిందీ, ఓవర్సీస్ లో నిరాశ పరిచింది. ది ప్యారడైజ్ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అదిరిపోయాయి.