పవన్ కళ్యాణ్ & గౌతమ్ మీనన్: క్రేజీ కాంబినేషన్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?

First Published | Nov 13, 2024, 3:57 PM IST

పవన్ కళ్యాణ్ మరియు గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. గౌతమ్ వాసుదేవ మీనన్ యొక్క యాటిట్యూడ్ నచ్చక పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టుకు నో చెప్పినట్లు సమాచారం.

Pawan Kalyan, Gautam Menon, vikram


కొన్ని కాంబినేషన్ అనుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాయి. అయితే ప్రాక్టికల్ ప్లాబ్లంలు వాటిని వెనక్కి లాగేస్తాయి. అలా బయిటకు వచ్చి ఆగిపోయిన క్రేజీ కాంబినేషన్స్ కొన్ని అయితే ప్రారంభంలోనే ఆగిపోయిన కాంబినేషన్ లు మరికొన్ని.

అలాంటి వాటిలో పవన్ కళ్యాణ్, గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్ ఒకటి. అప్పట్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అందరూ భావించారు. అయితే అనుకోకుండా మొదట్లోనే ఆగిపోయింది. అయితే ఎందుకు ఆగింది అనే వివరాల్లోకి వెళ్తే..

Pawan Kalyan, Gautam Menon, vikram


ప్రేమ నేపధ్యం ఉన్న సినిమాలను స్టైలిష్ గా తీయాలన్నా, సస్పెన్స్ సినిమాలు పర్ఫెక్ట్ గా తీయాలన్నా గుర్తొచ్చే ఫస్ట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గా చెప్తారు. డైరెక్టర్ గా తాను ఎన్నో సినిమాలు విజయం సాధించాడు. గత కొద్ది సంవత్సరాలుగా డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ కూడా చేస్తూ జనాల్ని మెప్పిస్తున్నారు.

తన సినిమాలతో పాటు వేరే సినిమాల్లో కూడా గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు. యాక్టింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నారనే  పేరు తెచ్చుకున్నారు. అంతెందుకు తమిళంలో  గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రగా అన్బు సెల్వ‌న్ అనే చిత్రాన్ని ప్రకటించారు కూడా. అయితే ఆయన డైరక్టర్ గా హవా నడుస్తున్న టైమ్  లో చాలా మంది హీరోలు ఆయన తో చేయటానికి ఉత్సాహం చూపించారు.
 



అప్పట్లో అంటే వెంకటేష్ తో గౌతమ్ మీనన్ ...ఘర్షణ చిత్రం తీసి హిట్ కొట్టినప్పుడు మీడియా మొత్తం ఆయన్ని ఓ రేంజిలో లేపింది. అంత గొప్ప స్టైలిష్ డైరక్టర్ లేడండి. మణిరత్నంకు పోటీ అంది. నిజంగానే ఆయన ఆ స్దాయి సినిమాలు ఇచ్చారు.

అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనతో సినిమా చేయటానికి ఉత్సాహం చూపించారు. గౌతమ్ వాసుదేవమీనన్ ఓ యాక్షన్ , లవ్ కలిసిన ఓ క్లాస్ సబ్జెక్ట్ తో పవన్ ని కలిసారు. అయితే అది మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది.


కథ నచ్చినా గౌతమ్ వాసు దేవమీనన్ యాటిట్యూడ్ నచ్చకే ఆ ప్రాజెక్టుకు పవన్ నో చెప్పినట్లు సమాచారం. పవన్ ఈ స్క్రిప్టుపై కొద్ది రోజులు కూర్చుందామని, తన ఇమేజ్ కు తగినట్లుగా కొన్ని సీన్స్ మార్చాల్సి ఉంటుందని చెప్పారట.

ఓ కమర్షియల్ హీరోగా ఆ లిమిటేషన్స్ ఆయన పెట్టుకోక పోతే ఫ్యాన్స్ కు ఇబ్బంది అవుతుందని పవన్ వివరించి చెప్పారట. అయినా సరే గౌతమ్ ...తనకు కథ చర్చల్లో పాల్గొనటానికి కానీ, స్క్రిప్టు మార్చటానికి గానీ టైమ్ లేదని చెప్పారట. దాంతో పవన్ కు కోపం వచ్చి కథ డిస్కషన్ కే సమయం లేనప్పుడు సినిమా చేయటం ఎందుకు అని నో చెప్పేసారట.అదీ జరిగిన విషయం అని అప్పట్లో వెలిగిన మీడియావారు చెప్తూంటారు. 


ఇక సూర్యతో ‘కాక కాక’, కమల్ హాసన్‌తో ‘రాఘవన్’ లాంటి హిట్ చిత్రాలు రూపొందించింది తనే. ఇక చియాన్ విక్రమ్ (Chiyan Vikram), గౌతమ్ ఇద్దరూ తమ కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే 2016లో ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram) మూవీని మొదలుపెట్టారు.

భారీ బడ్జెట్‌తో ఈ మూవీ మేకింగ్ మొదలవగా.. 2019లో దాదాపు షూటింగ్ మొత్తం అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉందని ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఆ మూవీ ఆర్థిక సమస్యలతో మూలనపడింది.ధ్రువ నక్షత్రం’పై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పిన గౌతమ్.. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. కానీ ఆ సినిమానే రిలీజ్ అవటం లేదు. 

Latest Videos

click me!