ఆ సినిమానే `బొబ్బిలిసింహం`. కృష్ణంరాజు హీరోగా అప్పటికే కృష్ణంరాజుతో నాలుగైదు సినిమాలు చేసి విజయాలు అందుకున్న డైరెక్టర్ బి భాస్కర్‌రావు దర్శకత్వంలో ఈ మూవీ ప్రారంభమైంది. ఇందులో కృష్ణంరాజుకి జోడీగా జయప్రద హీరోయిన్‌గా నటించింది. రఘువరన్, శ్రీరాంకుమార్, వాణీ విశ్వనాథ్, ప్రభాకర్‌రెడ్డి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ఇతర పాత్రలు పోషించారు. బండా పుల్లారెడ్డి, ఎక్కటి కరుణ కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ సినిమాని 1989 ఆగస్ట్ 11న ప్రారంభిస్తున్నట్టు పేపర్ ప్రకటన వేశారు. ఆర్టిస్ట్, టెక్నీషియన్ల పేర్లు కూడా ప్రకటించారు. గ్రాండ్‌గా వరంగల్ నగరంలో ఈ సినిమా ప్రారంభమైంది. కానీ ఏం జరిగిందో ఏమో ఇది ఓపెనింగ్ సెర్మనీతోనే ఆగిపోయింది.