సూర్య ‘కంగువ’:నైజాంలో రిలీజ్ ఇష్యూలు?, పెద్ద సమస్యే

First Published | Nov 13, 2024, 3:56 PM IST

సూర్య నటించిన కంగువ సినిమా నవంబర్ 14న 8 భాషల్లో విడుదల కానుంది. అయితే, నైజాంలో థియేటర్స్ సమస్యలు, లాభాల పంపకాల విషయంలో వివాదాలు తలెత్తాయి.

Kanguva Release Trailer

ఓ సినిమాని భారీగా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఎంత పెద్ద నిర్మాత అయినా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులోనూ డబ్బింగ్ సినిమా అంటే మరీను. లోకల్ పరిచయాలు తక్కువు ఉంటాయి దాంతో ఎడ్జెస్ట్మెంట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు సూర్య తాజా చిత్రం కంగువకు అలాంటి సమస్యే నైజాంలో ఎదురైందని సమాచారం. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Kanguva


తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా భారీ అంచనాల మధ్య ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 14న 8 భాషల్లో ఈ కంగువా విడుదలకి సిద్ధమవుతోంది.

తమిళ్ బాహుబలిగా అక్కడి మీడియా ఈ కంగువా సినిమానికి అభివర్ణిస్తుండగా.. రూ.1000 కోట్ల వరకూ వసూలు చేస్తుందని తమిళ ట్రేడ్ నమ్ముతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ఏరియాకు తీసుకున్నారు. మొదట్లో రికార్డ్ బ్రేక్ అయ్యేలా రిలీజ్ చేస్తామని, ఎక్సక్లూజివ్ షోలు వేస్తామని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అయితే ఇప్పుడు డీసెంట్ రిలీజ్ కు థియేటర్స్ సమస్య వచ్చిందని ట్రేడ్ లో వినపడుతోంది. 

Latest Videos


Actor Suriya Kanguva


కంగువా రిలీజ్ కు అడ్డం పడుతోంది దీపావళి రిలీజ్ లు. విడుదలైన మూడు సినిమాలు కలెక్షన్స్ వస్తున్నప్పుడు వాటిని తీసేయటానికి ఏ డిస్ట్రిబ్యూటర్, ఎగ్డిబిటర్ ఒప్పుకోరు. మరో ప్రక్క అదే రోజు వరుణ్ తేజ్ మట్కా సినిమా రిలీజ్ అవుతోంది. ఆ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో కంగువాకు ఇద్దామనుకున్న థియేటర్స్ కొన్ని అటు వైపు వెళ్లిపోతున్నాయి. 

Suriya Kanguva film


ఇవన్నీ ఒకెత్తు అయితే ఫ్రాఫిట్ షేరింగ్ విషయంలో సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. కంగువాకు అనుకున్నంత స్థాయిలో థియేట‌ర్లు దొరకటం లేదు. దానికి కార‌ణం.. మైత్రీ వచ్చిన ఇబ్బంది.  మామూలుగా  సింగిల్ స్క్రీన్స్ లో షేరింగ్ ప‌ద్ధ‌తిలో థియేట‌ర్లు తీసుకొంటుంటారు.

కానీ.. ‘కంగువా’కు మాత్రం రెంట‌ల్ ప‌ద్ధ‌తిలో సినిమాలు ఇవ్వాల‌ని మైత్రీ డిసైడ్ అయ్యింది. దాంతో ఏసీయ‌స్ సినిమాస్‌ వారు ఒప్పుకోవటం లేదు. .. త‌మ థియేట‌ర్లు ‘కంగువా’కు ఇవ్వ‌డానికి ఇష్టపడటం లేదని సమాచారం. చివరకు ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ లో సైతం ‘కంగువా’కు స్క్రీన్లు ఇవ్వలేదు. షేరింగ్ ప‌ద్ధ‌తిలో అయితేనే స్క్రీన్లు ఇస్తామ‌ని ఏషియ‌న్ చెప్పటంతో ఇప్పుడు మైత్రీ వారు ఏం చేయాలా అనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.  
  

Actor Suriya starrer Kanguva film update


ఏదైమైనా  తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం కంగువ. ఈ  సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ చిత్రం టీమ్ ఓ ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ విషయంలోనూ ఈ మూవీ సినీ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తోంది.

ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సూర్య డిఫరెంట్ గెటప్‍లో యోధుడిగా నటిస్తున్నారు.  ఈ మేరకు సినిమా ప్రమోషన్స్‌ బాధ్యతలను కూడా భుజాన వేసుకుని హీరో సూర్య దేశమంతా తిరుగుతున్నారు. అయితే.. ఇప్పుడు కొత్తగా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లోనూ కంగువాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైపోయింది. 

Kanguva

 ‘కంగువ’ చిత్రం కథ ఓ గిరిజన యోధుడు చుట్టూ తిరుగుతుంది. అతను 1678 నుంచి ఈ కాలానికి వస్తాడు. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయింతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏమిటి...ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేసారనేదే కథ. గతంలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో సూర్య ఓ చిత్రం చేసారు.

ఆ సినిమా పేరు 24. ఇప్పుడు కూడా టైమ్ ట్రావెల్ తో రెండు విభిన్న కాలాలలో ఈ సినిమా జరుగుతుంది. ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రం రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసారు. ఈ నేపధ్యంలో చిత్రం గురించి చెప్తూ ఈ ప్లాట్ ని రివీల్ చేసారు.  ఈ మూవీ కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని సమాచారం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో ఈ సినిమాని ఆడియన్స్ కి చూపించబోతున్నారు.  .  దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

read more:సూర్య ‘కంగువ’: స్టోరీ లైన్ , తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు

also read: ఆగిపోయిన కృష్ణంరాజు సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన బాలకృష్ణ.. ఆ మూవీ ఏంటి? అసలేం జరిగిందంటే?
 

click me!