నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు. ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి వండర్స్ క్రియేట్ చేశాడు. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి చిత్రాలతో అతిపెద్ద మాస్ హీరోగా ఎదిగాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్టీఆర్ పలువురు స్టార్ హీరోయిన్స్ తో జతకట్టాడు.