నేను నాన్నతో వెళతా అని అడిగిన ఆద్య..రేణు దేశాయ్ ఎందుకు ఒప్పుకుందో తెలుసా, షాకింగ్ రియాక్షన్

Published : Aug 15, 2024, 07:13 PM ISTUpdated : Aug 15, 2024, 07:23 PM IST

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అధికారికంగా జాతీయ జెండా ఎగరవేశారు. 

PREV
16
నేను నాన్నతో వెళతా అని అడిగిన ఆద్య..రేణు దేశాయ్ ఎందుకు ఒప్పుకుందో తెలుసా, షాకింగ్ రియాక్షన్
Renu Desai

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అధికారికంగా జాతీయ జెండా ఎగరవేశారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చాలా ఏళ్ళ క్రితమే విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. 

26
Pawan Kalyan

అయితే వీరి పిల్లలు అకిరా నందన్, ఆద్య ఇద్దరూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. పవన్ అభిమానులు అకిరా, ఆద్య ఫోటోలని షేర్ చేస్తూ సంబరపడుతుంటారు. నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తన తండ్రితో కలసి ఆద్య కూడా పాల్గొంది. 

36

ఆ దృశ్యాలు నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఆద్య.. పవన్ కళ్యాణ్ తో కలసి తీసుకున్న క్యూట్ సెల్ఫీ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఏకంగా రేణు దేశాయ్ కూడా ఈ సెల్ఫీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే రేణు దేశాయ్ ఈ ఫోటో పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

46
Renu Desai

నేను నాన్నతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళనా అని ఆద్య నన్ను అడిగింది. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. ఆద్య వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తోంది. అంతే కాక కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఎంత బిజీ షెడ్యూల్ లో గడుపుతారో తెలుస్తోంది. అదే విధంగా ఏపీ ప్రజల కోసం వాళ్ళ నాన్న చేస్తున్న సేవలు ఆద్య చూడాలి అని కూడా రేణు దేశాయ్ కోరుతూ ఈ పోస్ట్ పెట్టింది. 

56
Renu desai

రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ భార్య భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటున్నారు. మారోవైపు అకిరా నందన్ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటోందో తెలియదు కానీ.. అతడు బయట కనిపిస్తే జూనియర్ పవర్ స్టార్ అని అనేస్తున్నారు. 

66

అకిరా ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. అకీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి రేణు దేశాయ్ ఇటీవల హింట్స్ ఇచ్చింది. అకిరాకి నటుడు కావాలనే ఆలోచన ప్రస్తుతం లేదు.. నేనైతే అకిరాని బిగ్ స్రీన్ పై చూడాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories