సమంతతో ఉన్న ఆ ఒక్క ఫొటో చైతూ ఎందుకు డిలేట్ చేయలేదు ?

First Published | Aug 9, 2024, 6:18 PM IST

 నిశ్చితార్దం అయ్యిన నేపధ్యంలో   చైతన్య  సోషల్ మీడియా నుంచి సమంత (Samantha) ఫోటోలు డిలీట్ చేశాడా? అని చూడటం మొదలెట్టారు. 

Astrologer comments actor Naga Chaitanya and Sobhita break up in 2027


చైతూ ఫ్యాన్స్ కు ఇప్పుడో కొత్త పజిల్ మొదలైంది. చైతన్య తన ఎంగేజ్మెంట్ ని శోభిత తో చేసుకన్న వేళ...ఓ చిత్రమైన విషయం వాళ్ల కళ్ళపడింది. ఎవరూ ఊహించని విధంగా నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)ఎంగేజ్మెంట్  సీక్రెట్గా జరిగిపోయింది. లాస్ట్ మినిట్ వరకూ ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడిన అక్కినేని ఫ్యామిలీ..వీరి ఎంగేజ్‌మెంట్ తో ఏకంగా ఫొటోలనే రిలీజ్ చేసింది. నాగార్జున ఓ పోస్ట్ పెట్టి తన దీవెనలు అంద చేసేసారు. దీంతో చై జీవితంలో సమంత ఛాప్టర్ పూర్తిగా క్లోజ్ అయ్యిపోయినట్లైంది.
 


ఇక సాధారణంగా తాము బ్రేకప్ లో ఉన్నప్పుడు కానీ డైవర్స్ అయ్యినప్పుడు కానీ తమ గతానికి సంభందించిన ఫొటోలు డిలేట్ చేస్తూండటం ఈ మధ్యన సెలబ్రెటీలు చేస్తున్నారు. అలా చైతూకి నిశ్చితార్దం అయ్యిన నేపధ్యంలో   చైతన్య  సోషల్ మీడియా నుంచి సమంత (Samantha) ఫోటోలు డిలీట్ చేశాడా? అని చూడటం మొదలెట్టారు. ఎందుకంటే, నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం వార్త రాగానే చై ఫ్యాన్స్ తన ఇంస్టాగ్రామ్ తరువుగా చెక్ చేసారు.అందులో మాజీ భార్య సమంతతో ఉన్న కొన్ని ఫొటోస్ తీసేసారు. 
 



దీంతో నాగ చైతన్య తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ముందు కొత్త డెసిషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  అయ్యితే సమంత, చైతుల  చిత్రం మజిలీ  ప్రమోషన్ పోస్టర్‌లను మాత్రమే వదిలివేశాడు. అదే సమయంలో సమంతాతో ఉన్న  ఒక ఫోటో మాత్రం చైతు తీయలేదు. ఇద్దరు ఓ రేస్ కారు పక్కన నిలబడి ఉన్న స్నాప్‌షాట్, దీనిని చైతన్య 2018లో పోస్ట్ చేసారు, “త్రో బ్యాక్… మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్” అని పెట్టారు.
 


అన్నీ ఫొటోలు, పోస్ట్ లు తీసేసి ఈ పోస్ట్ మాత్రం ఎందుకు ఉంచాడు అనేది మాత్రతం సమంత అభిమానులకు అంతుపట్టడం లేదు. చైతన్య నిశ్చితార్థం వెలుగులోకి రావడంతో మరోసారి ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఇక్కడ నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. సమంతతో చైతు తనకున్న మెమోరీస్ అన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఒక అభిమాని ఇలా అన్నా డు, “మీరు సామ్ యొక్క అన్ని చిత్రాలను తొలగించారు. ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్‌లో కూడా అన్ ఫాలో చేశారు. మీరు దీన్ని ఎందుకు డిలీట్ చేయలేదు?" అని అడిగాడు.
 


ఇక నాగ చైతన్య అక్టోబర్ 2017లో సమంతతో వివాహం కాగా..వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా  వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని నాగ చైతన్య  ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.

Latest Videos

click me!