ఇక ముందుగా రోజా సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందన్న టాక్ కూడా నడిచింది. అయితే జబర్థస్త్ లోకి ఆమెకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్టు సమాచారం. ఇక చిరు, పవన్, బాలయ్యపై ఆమె చేసిన విమర్శల కారణంగా.. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలపై హోప్స్ లేవు.. తమిళనాట రజినీకాంత్ పై ఆమె చేసిన వాఖ్యలు.. వైసీపీ తిట్లు కారణంగా రోజాపై అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. దాంతో రాజికీయంగానే చూసుకోవాలి అని ఆమె భవిస్తుందన్న టాక్ నడుస్తోంది. మరి రోజా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. ఒకటి మాత్రం నిజం.. ప్రస్తుతం వైసీపీలో ఆమె యాక్టీవ్ గా లేరు అన్నది అందరికి తెలిసిన నిజం.